కాంగ్రెస్ టికెట్లకు దరఖాస్తులు.. ఈ నెల 18 నుంచి 25 వరకు స్వీకరణ

By Mahesh K  |  First Published Aug 15, 2023, 6:15 AM IST

కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేయాలని భావించినవారు ఈ నెల 18వ తేదీ నుంచి 25వ తేదీల మధ్య దరఖాస్తు చేసుకోవాలి. వచ్చే నెల రెండో వారంలో ఎంపికైనా అభ్యర్థులతో ఓ జాబితా విడుదల చేస్తారు.
 


హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేయాలని భావించే అభ్యర్థులు ఈ నెల 18వ తేదీ నుంచి  25వ తేదీల మధ్య దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. వచ్చే నెల రెండో వారంలో అభ్యర్థుల జాబితాను ప్రకటించాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది. 

ఈ నెల 18 నుంచి 25వ తేదీల మధ్య  అభ్యర్థుల నుంచి దరఖాస్తులు తీసుకోవాలని ప్రదేశ్ ఎన్నికల కమిటీ, స్క్రీనింగ్  కమిటీలు నిర్ణయించాయి. అయితే, దరఖాస్తు రుసుము ఎంతగా నిర్ణయించాలని? రిజర్వ్డ్ అభ్యర్థులకు మినహాయింపులు ఏమైనా ఇవ్వాలా? వంటి అంశాలపై ఏకాభిప్రాయం కుదరలేదు. వీటిపై స్పష్టీకరణ కోసం ఓ సబ్ కమిటీ వేశారు. దామోదర రాజనర్సింహ నేతృత్వంలో ఆ మీటింగ్ జరుగాయి. రోహిత్ చౌదరి, మహేశ్ కుమార్ గౌడ్‌లు ఈ కమిటీ సభ్యులుగా ఉన్నారు.

Latest Videos

ఈ కమిటీ 17వ తేదీ నాటికి విధివిధానాలు రూపొందించి ప్రదేశ్ ఎన్నికల కమిటీకి అందించాలి. ఆ మరుసటి రోజు నుంచి దరఖాస్తులను స్వీకరించాలని నిర్ణయం జరిగింది. నియోజకవర్గాల వారీగా అందిన దరఖాస్తులను సెప్టెంబర్ మొదటి వారంలో పరిశీలిస్తారని, ఒక్కో స్థానానికి ముగ్గురి నుంచి ఐదుగురి పేర్లతో జాబితా సిద్ధం చేస్తారని కాంగ్రెస్ నేతలు తెలిపారు.

Also Read: ప్రైవేట్ పార్టులకు గాయాలుంటేనే రేప్ జరిగినట్టా? లేకుంటే కాదా?: ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

ఆ జాబితాను స్క్రీనింగ్ కమిటీ వడపోసి కేంద్ర ఎన్నికల కమిటీకి ఆ రిపోర్టును పంపిస్తామని చెప్పారు. సర్వే ఫలితాలు, ఇతర అంశాలను దృష్టిలోపెట్టుకుని టికెట్లు ఖరారు చేస్తారని సమాచారం. ఏదైనా స్థానంలో ఇద్దరు బలమైన అభ్యర్థులుగా గట్టిగా టికెట్ కోసం ప్రయత్నిస్తే.. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అభ్యర్థిపై తుది నిర్ణయం తీసుకుంటుంది.

click me!