
హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్ (hyderabad) శివారులోని ఫీర్జాదిగూడ ప్రాంతంలోని ఓ బార్ యాజమాన్యం స్థానికులపై దాడికి పాల్పడింది. 10మందిపై బార్ యాజమాన్యం విచక్షణారహితంగా దాడికి పాల్పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా వుండగా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.
Video
తమవారిని కొడుతుండగా అడ్డుకున్న కుటుంబసభ్యులను కూడా బార్ యజమాన్యం దాడిచేసారు. ఆడవాళ్లను కూడా బూతులు మాట్లాడుతూ దౌర్జన్యానికి దిగారు. ఎవరికైనా చెప్పుకోండి అంటూ బెదిరింపులకు గురిచేస్తున్నారని మహిళలు, బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.