కేసీఆర్ దుర్మార్గ పాలన హద్దులు మీరుతోంది - టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి

By team teluguFirst Published Jan 10, 2022, 2:29 PM IST
Highlights

ఆత్మహత్య చేసుకున్న టీచర్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ని అరెస్టు చేయడాన్ని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఖండించారు. టీఆర్ఎస్ దుర్మార్గ పాలన హద్దులు మీరుతోందంటూ విమర్శించారు. 
 

తెలంగాణ‌లో టీఆర్ఎస్ (trs) దుర్మార్గ పాల‌న హ‌ద్దులు మీరుతోంద‌ని టీపీసీసీ ప్రెసిడెంట్  రేవంత్ రెడ్డి (tpcc president revanth reddy)  ఆరోపించారు. ఆత్మహత్య చేసుకున్న టీచర్ (teacher) కుటుంబాన్ని పరామర్శిచేందుకు వెళ్తున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని (mlc jeevan reddy) అరెస్టు చేయడానికి ఆయ‌న దుయ్య‌బ‌ట్టారు. ఈ మేర‌కు ఆయ‌న ట్విటర్ (twitter)లో ‘‘ప్రజా సమస్యల పై స్పందించే ప్రతిపక్ష నేతలు కేసీఆర్ కు దొంగల్లా కనిపిస్తున్నారా ? బాధిత కుటుంబాలను పరామర్శించడం ఏమైనా నేరమా ? ప్రతిపక్ష నేతలు ప్రభుత్వ తప్పులను ప్రశ్నించడం ప్రజలు, రాజ్యాంగం ఇచ్చిన హక్కు. కేసీఆర్ దుర్మార్గ పాలన హద్దులు మీరుతోంది. మూల్యం తప్పక చల్లించుకుంటారు.’’ ట్వీట్ చేశారు. ‘‘ 317 జీవో (317 GO ) కారణంగా మనస్థాపానికిలోనై ఆత్మహత్య చేసుకున్న బీంగల్ (beemgal)కు చెందిన గవర్నమెంట్ టీచర్ (government teacher) సరస్వతి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కారును పోలీసులు వెంబడించి కమ్మర్ పల్లి వద్ద అడ్డుకుని, అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా’’ అంటూ ఆయన మరో ట్వీట్ చేశారు. 

నిజామాబాద్ (nizamabad) జిల్లా భీంగల్‌ మండలం బాబాపూర్‌ (babapur)లో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు సరస్వతి శ‌నివారం ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. ఉద్యోగుల కేటాయింపుల్లో భాగంగా ఆమెను కామారెడ్డి (kamareddy)జిల్లా గాంధారి (gandhari) మండలం మర్లకుంట తండాకు బదిలీ చేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. కొన్నేళ్లుగా  రహత్‌నగర్‌లో సరస్వతి ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. 

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన 317 జీవోను ఉపాధ్యాయులు, ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనిని ప్ర‌తిప‌క్షాలు కూడా తీవ్రంగా వ్య‌తిరేకిస్తూ ఆందోళ‌న‌కు దిగాయి. ఇదే విష‌యంలో ఇటీవ‌లే తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (bjp state president bandi sanjay) నిర‌స‌న చేపట్టారు. ఆ స‌మ‌యంలో ఆయ‌నను అరెస్టు చేయ‌డం, పోలీసు స్టేష‌న్ కు త‌ర‌లించడం, బెయిల్ రిజెక్ట్ కావ‌డం, త‌రువాత బెయిల్ రావ‌డం వంటి ఘ‌ట‌న‌లు జ‌రిగాయి. ప్ర‌భుత్వం జారీ చేసిన 317 జీవోను వెన‌క్కి తీసుకునేంత వ‌ర‌కు తాము నిర‌స‌న‌లు, పోరాటాలు ఆప‌బోమ‌ని బీజేపీ తెలిపింది. అలాగే కాంగ్రెస్ కూడా ఈ జీవోను వ్య‌తిరేకిస్తోంది. టీచ‌ర్ ఆత్మ‌హ‌త్య త‌రువాత ఆమె కుటుంబాన్ని ప‌రామ‌ర్శిచేందుకు కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు, ఎమ్మెల్సీ జీవ‌న్ రెడ్డి ప్ర‌య‌త్నించారు. ఈ స‌మ‌యంలో నాట‌కీయ ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. ఆయ‌న వాహ‌నాన్ని వెంబ‌డించిన పోలీసులు క‌మ్మ‌ర్ ప‌ల్లి వ‌ద్ద జీవన్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఈ నేప‌థ్యంలోనే రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. 

ఈ 317 జీవో ప్ర‌కారం ప్ర‌భుత్వ  ఉద్యోగి పుట్టిన ప్రాంతాన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకోకుండా క్యాడ‌ర్ (cader) సీనియారిటీని పరిగణనలోకి తీసుకుటోంది. దీని వ‌ల్ల ఉద్యోగులు త‌ను నివ‌సించే ప్ర‌దేశాల కంటే దూర ప్రాంతాలకు ట్రాన్స్ ఫ‌ర్ (transfer) అయ్యే అవ‌కాశాలు ఉంటాయి. ఈ కొత్త జీవో వ‌ల్ల భార్యా భ‌ర్త‌లు ప్ర‌భుత్వ ఉద్యోగులుగా ఉంటే ఇద్ద‌రు వేరు వేరే జిల్లాలో ప‌ని చేసే అవ‌కాశాలు ఉంటాయి. అందుకే ఈజీవోపై ఉద్యోగులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. 
 

click me!