
ఆయన ఓ బ్యాంకు ఉన్నతోద్యోగి. చాలా కాలం నుంచి బ్యాంకింగ్ రంగంలోనే పని చేస్తున్నారు. ఖాతాదారులు సైబర్ మోసగాళ్ల బారిన పడి డబ్బులు ఎలా మోసపోతారో అవగాహన ఉంది. కానీ ఆయనే సైబర్ మోసగాళ్ల చిక్కారు. తన మొబైల్ కు వచ్చిన లింక్ ను క్లిక్ చేసి దాదాపు 2.25 లక్షలు పోగొట్టుకున్నాడు. ఈ సంఘటన హనుమకొండ జిల్లాలో శుక్రవారం జరిగింది.
దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పరకాలలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) బ్రాంచ్ లో బీహార్ కు చెందిన సకల్ దేవ్‌సింగ్ మేనేజర్ గా పని చేస్తున్నారు. ఆయనకు ఈ నెల 23వ తేదీన రాత్రి సమయంలో ఓ నెంబర్ నుంచి మెసేజ్ వచ్చింది. అందులో ‘మీ ఎస్‌బీఐ అకౌంట్ డీయాక్టివేట్ అవుతోంది. దయచేసి మేము పంపించిన లింక్ క్లిక్ చేసి మీ పాన్ కార్డు నెంబర్ ను అప్ డేట్ చేయండి’’ అని ఉంది. ఈ మెసేజ్ ను ఆయన తెల్లవారుజామున చూసుకున్నారు. దానిని నిజమని నమ్మారు.
విద్యార్థినులతో నలుగురు ఉపాద్యాయులు, స్కూల్ బస్సు డ్రైవర్ అసభ్య ప్రవర్తన, వేధింపులు..
పాన్ కార్డ్ నెంబర్ ను అప్ డేట్ చేద్దామనే ఉద్దేశంతో ఆ మెసేజ్ పై రెండు సార్లు క్లిక్ చేశాడు. అందులో పాన్ కార్డ్ అప్ డేట్ చేసేందుకు ప్రయత్నించాడు. కానీ అది విఫలం అయ్యింది. తరువాత ఆయన బస్సులో బ్యాంకుకు బయలుదేరాడు. ఆ సమయంలో ఆయనకు మరో నెంబర్ నుంచి కాల్ వచ్చింది. పాన్ కార్డు అప్ డేట్ చేసేందుకు తాము మరో మేసేజ్ పంపించామని, దానిపై క్లిక్ చేస్తే అప్ డేట్ అవుతుందని అందులో ఓ వ్యక్తి చెప్పారు. అయితే తాను బస్సులో ఉన్నానని, బ్యాంకు వెళ్లిన తరువాత ఆ ప్రక్రియ పూర్తి చేస్తానని సకల్ దేవ్‌సింగ్ బదులిచ్చారు.
రైతన్న కన్నీరు.. 512 కిలోల ఉల్లి అమ్మితే.. చేతికి వచ్చింది రూ.2 !!
బ్యాంకుకు వెళ్లిన తరువాత తనకు వచ్చిన నెంబర్ కు మేనేజర్ కాల్ చేశారు. అవతలి వ్యక్తి మరో సారి వాట్సప్ కు ఓ లింక్ ను పంపించాడు. దానిని ఓపెన్ చేయగానే క్షణాల్లో అకౌంట్ లో నుంచి డబ్బులు మాయం అయ్యాయి. మొత్తం మూడు లావాదేవీల్లో రూ.2,24,967 అకౌంట్ నుంచి డెబిట్ అయ్యాయి. దీంతో తాను మోసపోయానని గ్రహించిన మేనేజర్ వెంటనే పోలీసులను సంప్రదించాడు. సైబర్ నేరగాళ్లు తన అకౌంట్ నుంచి డబ్బులు కాజేశారని ఫిర్యాదు చేశారు.