ఈటల రాజేందర్ బీజేపీలో చేరడంపై ఢిల్లీలోని పార్టీ పెద్దలతో మాట్లాడారు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. ఉద్యమకారులను కాపాడుకోవాలని సంజయ్ ఈ సందర్భంగా పెద్దలకు చెప్పినట్లుగా తెలుస్తోంది.
ఈటల రాజేందర్ బీజేపీలో చేరడంపై ఢిల్లీలోని పార్టీ పెద్దలతో మాట్లాడారు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. ఉద్యమకారులను కాపాడుకోవాలని సంజయ్ ఈ సందర్భంగా పెద్దలకు చెప్పినట్లుగా తెలుస్తోంది. అనంతరం ఈటల చేరికపై రాష్ట్ర నేతల అభిప్రాయం సేకరిస్తున్నారు సంజయ్. అయితే ఈటలను బీజేపీలో చేర్చుకోవాలని బండి సంజయ్‌కు పార్టీ నేతలు సూచించారు. ఈటల బీజేపీలో చేరికపై రెండ్రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం వున్నట్లుగా తెలుస్తోంది.
మరోవైపు బుధవారం హుజూరాబాద్ నియోజకవర్గంలోని తన అనుచరులతో ఈటల రాజేందర్ భేటీ అయ్యారు. ఇవాళ కూడా మరోసారి అనుచరులతో భేటీ అయ్యారు. తనతో కలిసే వచ్చే నేతలతో తన రాజకీయ భవిష్యత్తు గురించి ఈటల రాజేందర్ వివరిస్తున్నారు. ఈటల రాజేందర్ ను బీజేపీలో చేర్చుకొనేందుకు ఆ పార్టీ రాష్ట్ర స్థాయి నాయకత్వం కూడ సానుకూలంగా ఉంది. అయితే ఈ విషయమై కేంద్ర నాయకత్వం నుండి గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉంది. కేంద్ర నాయకత్వం నుండి గ్రీన్ సిగ్నల్ వస్తే కేంద్ర నాయకులతో ఈటల రాజేందర్ భేటీ అయ్యే అవకాశం ఉంది.
undefined
Also Read:బీజేపీలోకి ఈటల: అనుచరులతో ఇవాళ కూడ భేటీ, త్వరలో ఢిల్లీకి?
ఈటల రాజేందర్ ఢిల్లీలో బీజేపీ నేతలను కలిసి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే అవకాశం ఉందని సమాచారం. ఈటల రాజేందర్ తో టీఆర్ఎస్ నాయకులు ఎవరూ కూడా వెళ్లకుండా ఉండేందుకు గాను గులాబీ బాస్ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. టీఆర్ఎస్ లో ట్రబుల్ షూటర్ గా పేరున్న హరీష్ రావుకు హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం బాధ్యతలు అప్పగించారు. ఈ నియోజకవర్గానికి చెందిన కొందరు కీలక నేతలతో హరీష్ రావు సమావేశమయ్యారు.