జూడాల డిమాండ్‌లకు తెలంగాణ సర్కార్ అంగీకారం, సాయంత్రం సమ్మె విరమణ..?

Siva Kodati |  
Published : May 27, 2021, 02:26 PM IST
జూడాల డిమాండ్‌లకు తెలంగాణ సర్కార్ అంగీకారం, సాయంత్రం సమ్మె విరమణ..?

సారాంశం

జూనియర్ డాక్టర్ల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. అయితే లిఖిత పూర్వక హామీ ఇవ్వకపోవడంపై మాత్రం జూడాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. లిఖిత పూర్వక హామీ కావాలని వారు పట్టుబడుతున్నారు. సమ్మె విరమణపై సాయంత్రం నిర్ణయం తీసుకోనున్నారు జూడాలు. 

కాగా, జూనియర్ డాక్టర్లను తెలంగాణ ప్రభుత్వం మరోసారి చర్చలకు పిలిచింది. బుధవారం నాడు ప్రభుత్వంతో నిర్వహించిన చర్చలు విఫలం కావడంతో గురువారం నాడు మరోసారి ప్రభుత్వంతో జూడాలు చర్చించనున్నారు.తెలంగాణ హెల్త్ సెక్రటరీ రిజ్వీ పిలుపు మేరకు జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ తరపున ప్రతినిధులు ఇవాళ  చర్చల్లో పాల్గొన్నారు. కరోనా రోగులకు చికిత్స చేస్తూ మృతి చెందే వైద్య ఆరోగ్య సిబ్బందికి పరిహారం చెల్లింపు విషయంతో పాటు  నిమ్స్ లో వైద్య ఆరోగ్య సిబ్బంది కుటుంబసభ్యులకు చికిత్స అందించాలని జూడాలు పట్టుబడుతున్నారు. 

Also Read:చర్చలు విఫలం: లిఖిత పూర్వక హామీ ఇవ్వాల్సిందే.. అప్పుడే విధుల్లోకి, తేల్చి చెప్పిన జూడాలు

ఈ విషయమై ప్రభుత్వం నుండి స్పష్టత వస్తే తాము తిరిగి విధుల్లో చేరుతామని జూనియర్ డాక్టర్లు ప్రకటించారు. తమ డిమాండ్లు పరిష్కరించకపోతే సమ్మె చేస్తామని ఈ నెల 10వ తేదీనే డీఎంఈకి జూడాలు నోటీసులు ఇచ్చారు. ప్రభుత్వం నుండి సానుకూలంగా స్పందన రాకపోవడంతో జూడాలు సమ్మెకు దిగారు. ఇవాళ్టి నుండి అత్యవసర సేవలను కూడ జూడాలు బహిష్కరించారు. ఈ సమయంలో జూనియర్ డాక్టర్లు సమ్మెుక దిగడం సరైందికాదని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. జూడాల తీరుపై ఆయన  బుధవారం నాడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

PREV
click me!

Recommended Stories

Jeevan Reddy: అన్నా.. నన్ను దేవుడే పంపిండు మీతో కలిసి పని చేయమని: జీవన్ రెడ్డి | Asianet News Telugu
RED Alert: ఈ జిల్లాల్లో మాడు పగిలే ఎండలు 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్| Asianet News Telugu