తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి బండి సంజయ్ లేఖ.. అందులో ఏముందంటే ?

By Sairam Indur  |  First Published Dec 18, 2023, 5:39 PM IST

కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ (Karimnagar MP Bandi Sanjay).. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (telangana cm revanth reddy)కి బహిరంగ లేఖ రాశారు. అందులో మిడ్ మానేరు ముంపు బాధితుల సమస్యల (Mid Maneru flood ictims problems)ను పరిష్కరించాలని కోరారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినందుకు అభినందనలు తెలిపారు.


తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టినందుకు అభినందనలు తెలిపారు. ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగించాలని ఆకాంక్షించారు. ప్రజాస్వామ్యబద్దంగా పనిచేయాలని కోరారు. ఈ సందర్భంగా కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న మిడ్ మానేరు ముంపు బాధితుల సమస్యలను పరిష్కరించాలని పేర్కొన్నారు. 

మా పార్టీతో పొత్తు వల్లే తెలంగాణలో కాంగ్రెస్ కు విజయం - సీపీఐ నారాయణ

Latest Videos

ఆ లేఖలో ఇంకా ఏముందంటే?.. 
‘‘ఉమ్మడి రాష్ట్రంలో 17 ఏండ్ల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం మిడ్ మానేరు ప్రాజెక్టును ప్రారంభించింది. లక్షలాది ఎకరాలకు సాగు నీటితోపాటు తాగునీటి అవసరాలను తీరుస్తుందనే భావనతో ప్రాజెక్టు ముంపు పరిధిలోని 12 గ్రామాల ప్రజలు ఇండ్లు, భూములు త్యాగం చేశారు. ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం 12 వేల 500 మంది బాధితులున్నారు. వీరికి సహాయ పునరావాస ప్యాకేజీ కింద 2005-06లో నాటి ప్రభుత్వం చేపట్టిన జీవో నెం.69 ప్రకారం ఐఏవై కింద ఇండ్లు మంజూరు చేసింది. ముంపు పరిహారం చెల్లిస్తామని పేర్కొంది. అయితే వీటి అమలులో తీవ్రమైన జాప్యం జరిగింది. 2018 జూన్ 15న నాటి సీఎం కేసీఆర్ ఈ ప్రాంతానికి వచ్చి మిడ్ మానేరు బాధితులకు ఐఏవై ఇండ్లకు బదులుగా డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మిస్తామని, అందులో భాగంగా ఒక్కో బాధిత కుటుంబానికి రూ.5 లక్షల 4 వేలు చెల్లిస్తానని హమీ ఇచ్చారు.’’ అని పేర్కొన్నారు. 

మంత్రి కోమటిరెడ్డిపై హెలికాప్టర్‌తో పూల వర్షం.. నల్గొండలో అభిమానుల ఘన స్వాగతం

‘‘12 గ్రామాల రైతులంతా సాగు భూమిని కోల్పోయిన నేపథ్యంలో నీలోజిపల్లి నుండి నందిగామ, ఆగ్రహారం వరకు ఇండస్ట్రీయల్ కారిడార్ ను, స్కిల్ డెవలెప్ మెంట్ కాలేజీని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. దీని ద్వారా వారిలో నైపుణ్యత పెంచి స్వయం ఉపాధి కల్పిస్తామని ప్రకటించారు. అలాగే 2009 కొత్త గెజిట్ ప్రకారం తేది 01-01-2015 నాటికి 18 ఏండ్లు నిండిన యువతీ యువకులకు ముంపు పరిహారం, పట్టా ఇస్తామని చెప్పారు. కానీ నేటికి ఒక్క అడుగు ముందుకు పడలేదు.’’ అని తెలిపారు. 

Congress: తెలంగాణ నుంచి ఎంపీగా సోనియా గాంధీ పోటీ.. పీఏసీ మీటింగ్‌లో సంచలన తీర్మానం

‘‘ రెండేళ్ల క్రితం మిడ్ మానేరు ముంపు బాధితుల కోసం కొదురుపాకలో నిర్వహించిన అఖిలపక్ష ‘మహాధర్నా’లో మీరు (రేవంత్ రెడ్డి), నేను (బండి సంజయ్) హాజరై ముంపు బాధితులకు సంఘీభావం తెలిపాం. నాటి ధర్నాలో మిడ్ మానేరు బాధితుల సమస్యలను పరిష్కరించేదాకా వారి పక్షాన పోరాటం చేస్తామని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వాటిని పరిష్కరిస్తామని మీరు హామీ ఇచ్చారు. అదే సమయంలో ముంపు పరిహారం చెల్లింపు విషయంలో అర్హత లేకపోయినా రాజ్యసభ సభ్యుడు సంతోష్ రావు, ఆయన కుటుంబ సభ్యులతో పాటు మాజీ సీఎం కేసీఆర్ బంధువులకు సైతం ప్యాకేజీ కింద పరిహారం చెల్లించారని, అధికారంలోకి వచ్చాక వీరిపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఇటీవల మీరు అసెంబ్లీలోనూ ముంపు బాధితులకు న్యాయం చేస్తానని ప్రకటించడం సంతోషదాయకం. ఈ సందర్భంగా కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా.. మిమ్మల్ని మనస్పూర్తిగా ప్రత్యేకంగా అభినందిస్తూనే.. మరోసారి ఈ విషయాన్ని మీ ముందు ఉంచుతున్నాను.’’ అని తెలిపారు. 

మధ్యధరా సముద్రంలో పడవ బోల్తా.. 60 మంది దుర్మరణం.. మృతుల్లో మహిళలు, చిన్నారులు..

‘‘ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి మీరు సీఎంగా బాధ్యతలు చేపట్టారు. కాబట్టి మీరు తక్షణమే పెంచిన ఇండ్ల నిర్మాణ పరిహారాన్ని చెల్లించాలని కోరుతున్నాం. అదే విధంగా 2015 నాటికి 18 ఏళ్లు నిండిన యువతీ యువకులకు సైతం ప్యాకేజీని వర్తింపజేయాలి. ఆయా కుటుంబాలు సర్వం కోల్పోయినందున ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం.. నీలోజిపల్లి నుండి అగ్రహారం వరకు ఇండస్ట్రీయల్ కారిడార్, స్కిల్ డెవల్ మెంట్ కాలేజీలు ఏర్పాటు చేసి స్వయం ఉపాధి కల్పించాలి.’’ అని పేర్కొన్నారు.

భారత్ మళ్లీ కోవిడ్ కలకలం.. 5 మరణాలు, 335 కొత్త కేసులు.. యాక్టివ్ కేసులు ఎన్నంటే ?

‘‘అదే విధంగా అర్హత లేకున్నా ప్రభుత్వం నుండి లబ్ది పొందిన రాజ్యసభ సభ్యుడు సంతోష్ రావుతో పాటు మాజీ సీఎం బంధువులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. అర్హులందరికీ న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. దీంతోపాటు వెంటనే సంబంధిత మంత్రి, స్థానిక శాసనసభ్యుడు, ప్రజా ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి ముంపు బాధితుల సమస్యల పరిష్కారానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను’’ అని బండి సంజయ్ తన లేఖలో పేర్కొన్నారు. 

click me!