సీపీఐతో పొత్తు వల్లే కాంగ్రెస్ (Congress) పార్టీ తెలంగాణ (telangana)లో మెజారిటీ స్థానాలు గెలుచుకుందని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ (cpi narayana) అన్నారు. రాజస్థాన్ (rajasthan), ఛత్తీస్ ఘడ్ (Chhattisgarh), మధ్యప్రదేశ్ (madhya pradesh)లో పొత్తు లేకపోవడం వల్లే అక్కడ ఓడిపోయిందని తెలిపారు.
cpi narayana : తమ పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్లే కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. మిగితా రాష్ట్రాల్లో కూడా తమతో పొత్తు పెట్టుకుంటే గెలిచేవారని తెలిపారు. అందుకే ఇటీవల జరిగిన మూడు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయిందని చెప్పారు. ఈ విషయం ఆ పార్టీ అధిష్టానం గుణపాఠంగా తీసుకోవాలని అన్నారు. ఏఐసీసీ ముఖ్యంగా దీనిని గమనించాలని తెలిపారు.
మంత్రి కోమటిరెడ్డిపై హెలికాప్టర్‌తో పూల వర్షం.. నల్గొండలో అభిమానుల ఘన స్వాగతం
సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో తమ పార్టీకి 90-100 నియోజకవర్గాల్లో దాదాపు 1000 నుంచి 10,000 ఓట్ల వరకు ఉంటాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి తమ ఓట్లు ఎంతో కలిసి వచ్చాయని తెలిపారు. మిగితా రాష్ట్రాలో పొత్తు పెట్టుకోకపోవడం వల్లనే ఆ పార్టీ ఓడిపోయిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ లో అధికారంలో ఉందని మరి అక్కడ ఎందుకు ఓడిపోయిందని ప్రశ్నించారు. అలాగే మధ్యప్రదేశ్ లో కూడా గతంలో వచ్చిన సీట్లును ఆ పార్టీ కోల్పోయిందని అన్నారు.
సీపీఐతో పొత్తువల్ల తెలంగాణాలో కాంగ్రెస్ మంచి మెజారిటీతో గెలిచింది.. మిగతా 3 రాష్ట్రాల్లో కూడా మాతో పొత్తుపెట్టుకుంటే గెలిచేవారు.. ఇది కేంద్ర కాంగ్రెస్‌కు గుణపాఠం - సీపీఐ నారాయణ pic.twitter.com/4QpwACy292
— Telugu Scribe (@TeluguScribe)ఆయా రాష్ట్రాల్లో కూడా సీపీఐతో పొత్తు పెట్టుకొని ఉంటే తమ పార్టీ ఓట్లు కూడా పడేవని, ఇవి ఎంతగానో కాంగ్రెస్ పార్టీకి కలిసివచ్చేవని నారాయణ అన్నారు. ఛత్తీస్ ఘడ్ లో బీజేపీ గెలిచిందని అన్నారు. దేశానికి ప్రమాదకరమైన బీజేపీని అక్కడ గెలిచేలా చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ గెలిచినా, ఓడినా తమకేమీ సమస్యల లేదని, కానీ బీజేపీ లాంటి మతోన్మాద పార్టీని ఎలా గెలిపించారని కాంగ్రెస్ ను ప్రశ్నించారు. ఇండియా భాగస్వామ్య కూటమిలోని పార్టీలను కలుపుకుపోవడం కాంగ్రెస్ పార్టీకి చాలా ముఖ్యమని చెప్పారు.