గంగుల గురించి తెలిసే ఒవైసీ వద్ద కేసీఆర్ మోకరిల్లాడు: బండి సంజయ్ సంచలన ఆరోపణలు

By Mahesh K  |  First Published Nov 14, 2023, 3:00 PM IST

గంగుల కమలాకర్ పై బండి సంజయ్ ఆరోపణలు గుప్పించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్‌ల నేతలు అవినీతిలో మునిగిపోయి ఉన్నారని అన్నారు. అందుకే ప్రజలు వారిని ఛీదరించుకుంటున్నారని, వారు ప్రచారానికి వెళ్లితే ప్రజలే నిలదీస్తున్నారని చెప్పారు. ఓటర్లను ప్రలోభపెట్టాలనే ఎత్తులు వేస్తున్నారని పేర్కొన్నారు.
 


హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం తారాస్థాయికి చేరుకుంటున్నది. ఒక పార్టీపై మరో పార్టీ విమర్శలు గుప్పించుకుంటున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా చేసిన ఎంపీ బండి సంజయ్ ఈ సారి కరీంనగర్ అసెంబ్లీ స్థానంలో మరోసారి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. కరీంనగర్ నుంచి 2014, 2018లలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గంగుల కమలాకర్ పై ఓడిపోయిన బండి సంజయ్ మరోసారి ఆయనపై పోటీకి దిగారు. ఇప్పుడు కరీంనగర్‌లో ప్రధాన పోటీ వీరిద్దరి మధ్యేనని టాక్. కాంగ్రెస్ అభ్యర్థి పురుమల్ల కూడా గట్టి పోటీ ఇస్తారని చెబుతున్నారు. తాజాగా, ప్రత్యర్థి గంగుల కమలాకర్ పై బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు.

గంగుల కమలాకర్ పై అవినీతి ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్‌ నేతలు భూకబ్జాలు, అవినీతిలో కూరుకుపోయారని ఆరోపించారు. జిల్లాలో ఎక్కడ ఇసుక కుప్పలు కనిపించినా బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిపారు. ఇక ఖాళీ జాగాలు కనిపిస్తే కబ్జా చేసేస్తున్నారని మండిపడ్డారు.

Latest Videos

నేడు బీఆర్ఎస్ నేతలు వీధుల్లో ప్రచారం కోస తిరుగుతుంటే ప్రజలే నిలదీస్తున్నారని బండి సంజయ్ అన్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టడానికి బీఆర్ఎస్ నేతలు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. ఇప్పటికే రూ. 10 వేల చొప్పున పంచడానికి సిద్ధం అయ్యారని ఆరోపించారు. అంతేకాదు, లక్ష సెల్ ఫోన్లను పంచడానికీ గంగుల కమలాకర్ సిద్ధం అయ్యాడని ఆరోపణలు చేశారు.

Also Read: కేటీఆర్ కు ముఖ్యమంత్రి పదవి...: హరీష్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు

కరీంనగర్ నుంచి ఈ సారి గంగుల కమలాకర్ ఓడిపోతాడని సీఎం కేసీఆర్‌కు తెలుసు అని, అందుకే జిల్లాలో ముస్లిం ఓట్లను వారి వైపు మళ్లించుకోవడానికి ఒవైసీ వద్ద కేసీఆర్ మోకరిల్లి పచ్చ జెండా పట్టుకున్నాడని ఆరోపించారు. అయినా.. గంగుల గెలువడని అన్నారు. గంగుల కమలాకర్ మళ్లీ గెలిస్తే జీతాలు, పింఛన్లు రావని పేర్కొన్నారు. తన అత్త చనిపోయిందని ఇంటికి వస్తే కేసీఆర్, గంగుల కమలాకర్ కుట్రపన్ని తనను జైలుకు తీసుకెళ్లారని బాధపడ్డారు.

click me!