నాంపల్లి అగ్ని ప్రమాదం: ఆధారాలను సేకరిస్తున్న క్లూస్ టీమ్, రమేష్ జైస్వాల్ ను అదుపులోకి తీసుకోనున్న పోలీసులు

By narsimha lode  |  First Published Nov 14, 2023, 10:53 AM IST

నాంపల్లి అగ్ని ప్రమాదంపై  క్లూస్ టీమ్  ఆధారాలను సేకరిస్తుంది. అగ్ని ప్రమాద తీవ్రత పెరగడానికి కెమికల్ డబ్బాలు కారణమని  అగ్నిమాపక శాఖ  అభిప్రాయపడుతుంది.


హైదరాబాద్:నాంపల్లి అగ్ని ప్రమాదంపై క్లూస్ టీమ్  ఆధారాలను సేకరిస్తుంది.  ఈ నెల  13వ తేదీన  నాంపల్లిలోని  బజార్ ఘాట్ లో  ఓ భవనంలో అగ్ని ప్రమాదం  జరిగింది.ఈ ప్రమాదంలో  తొమ్మిది మంది మృతి చెందారు. మరో  ఎనిమిది  మంది  ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన  వారు ఉస్మానియా ఆసుపత్రిలో  చికిత్స పొందుతున్నారు. 

అగ్ని ప్రమాదం జరిగిన  భవనంలో ఫోరెన్సిక్ టీమ్  ఆధారాలను సేకరిస్తుంది. మరో వైపు ఈ ప్రమాదం జరగడానికి గల కారణాలపై  క్లూస్ టీమ్  ఆరా తీస్తుంది. ప్రమాదం జరిగిన భవనంతో పాటు ఎదురుగా  ఉన్న భవనం కూడ స్వల్వంగా దెబ్బతింది . ఎదురుగా ఉన్న భవనంలో నివసిస్తున్న వారు  సహాయక చర్యల్లో పాల్గొన్నారు. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో  చోటు చేసుకున్న పరిణామాల గురించి క్లూస్ టీమ్  బృందం  ఆరా తీస్తుంది.

Latest Videos

undefined

అగ్ని ప్రమాదం జరిగిన  భవనంలో  రసాయన డబ్బాలను నిల్వ చేశారు.  ఈ డబ్బాల కారణంగా అగ్ని ప్రమాద తీవ్రత పెరిగిందని  అగ్నిమాపక శాఖ అభిప్రాయపడింది.   అయితే  రసాయనాలను ఈ భవనంలో  నిల్వ చేసినందుకు  రమేష్ జైస్వాల్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసన తర్వాత రమేష్ జైస్వాల్ అస్వస్థతకు గురయ్యారు. ఆయన ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.  ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన వెంటనే  రమేష్ జైశ్వాల్ ను  పోలీసులు అదుపులోకి తీసుకొంటారు.

also read:'కెమికల్ డబ్బాల వల్లే ప్రమాద తీవ్రత':నాంపల్లి అగ్నిప్రమాదంపై కేసు

మరోవైపు  అగ్ని ప్రమాదం జరిగిన  భవనాన్ని జేఎన్‌టీయూ  ఇంజనీర్ల బృందం పరిశీలించనుంది. భవనాన్ని పరిశీలించిన తర్వాత  భవన పటిష్టతపై  ఇంజనీర్ల బృందం  ఓ నివేదికను ఇవ్వనున్నారు. ఈ నివేదిక ఆధారంగా  భవనం కూల్చివేతపై నిర్ణయం తీసుకొంటారు.

ఇదిలా ఉంటే ఈ ప్రమాదంలో  గాయపడిన  వారికి మెరుగైన వైద్య సహాయం అందించాలని ప్రభుత్వం  వైద్యులను ఆదేశించింది.  ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల పరిస్థితి విషమంగానే ఉందని సమాచారం.  
 

click me!