ఆర్ఎస్ఎస్ తోలుబొమ్మ రేవంత్ రెడ్డి.. : అసదుద్దీన్ ఒవైసీ ఫైర్

By Sumanth Kanukula  |  First Published Nov 14, 2023, 11:52 AM IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్ది రాజకీయ నాయకుల మధ్య విమర్శల దాడి మరింతగా పెరుగుతుంది. తాజాగా టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డిపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.


తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్ది రాజకీయ నాయకుల మధ్య విమర్శల దాడి మరింతగా పెరుగుతుంది. తాజాగా టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డిపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి ‘ఆర్ఎస్ఎస్ తోలుబొమ్మ’ అంటూ అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. ‘‘మాపై విమర్శించడానికి మీకు (రేవంత్ రెడ్డి) ఏమీ లేదు. మీరు మా బట్టలు, గడ్డాల గురించి మాట్లాడి మాపై దాడి చేస్తున్నారు. దీనినే డాగ్ విజిల్ పాలిటిక్స్ అంటారు. నువ్వు ఆర్‌ఎస్‌ఎస్ కీలుబొమ్మవి. బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య ఎలాంటి తేడా లేదు’’ అని అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అయితే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆదివారం మాట్లాడుతూ.. కర్ణాటక ఎన్నికల సమయంలో మోదీ, అమిత్ షా సన్నిహితుడికి ఒవైసీ తన ఇంట్లో పార్టీ ఇచ్చారని ఆరోపించారు. దీనిపై దర్గా దగ్గరికి రమ్మన్నా, భాగ్యలక్ష్మీ టెంపుల్ దగ్గరకి రమ్మన్నా వస్తానని .. మరి మసీదులో ప్రమాణం చేసేందుకు అసదుద్దీన్ ఒవైసీ సిద్ధమా అని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఆయన ఒంటిపై షెర్వాణీ ఫైజామా ఉందని అనుకున్నానని.. కానీ షెర్వాణీ కింద ఖాకీ నిక్కర్ కూడా ఉందని విమర్శించారు.

Latest Videos

అయితే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు అసదుద్దీన్ ఒవైసీ తాజాగా కౌంటర్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.  ‘‘తెలంగాణ పీసీసీ చీఫ్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యుడిగా చడ్డీ కట్టుకుని ఏబీవీపీకి వెళ్లి, తెలుగుదేశంలో చేరి ఇప్పుడు కాంగ్రెస్‌లోకి వచ్చారు. కాంగ్రెస్ గాంధీ భవన్‌ను మోహన్ భగవత్ స్వాధీనం చేసుకున్నారని, ఆయన ఎలా కావాలంటే అలా కాంగ్రెస్‌ను నడిపిస్తారని ఎవరో సరిగ్గా చెప్పారు’’ అని అసదుద్దీన్ పేర్కొన్నారు. 

పౌరసత్వ సవరణ చట్టం నిరసనలను గుర్తుచేస్తూ.. నిరసనకారులను వారు ధరించిన దుస్తులను బట్టి గుర్తించవచ్చని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారని ఒవైసీ అన్నారు. ఒవైసీ షేర్వానీ గురించి మాట్లాడేటప్పుడు రేవంత్ కూడా అదే పని చేశారని ఆయన అన్నారు.

click me!