కేసీఆర్ నోరు తెరిస్తే అబద్దాలే.. పెట్రోల్‌‌పై వ్యాట్ విధించింది మీరు కాదా?.. కేసీఆర్‌పై బండి సంజయ్ ఫైర్

By team teluguFirst Published Nov 8, 2021, 1:58 PM IST
Highlights

ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) నిన్న గంట పాటు అబద్దాలు చెప్పారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ (Bandi Sanjay) మండిపడ్డారు. సోమవారం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌పై కౌంటర్ ఎటాక్ చేశారు. కేసీఆర్‌ నోరు తెరిస్తే అన్నీ అబద్దాలేనని మండిపడ్డారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) నిన్న గంట పాటు అబద్దాలు చెప్పారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ (Bandi Sanjay) మండిపడ్డారు. సోమవారం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌పై కౌంటర్ ఎటాక్ చేశారు. కేసీఆర్‌ నోరు తెరిస్తే అన్నీ అబద్దాలేనని మండిపడ్డారు. వరి కొనుగోళ్లపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై బండి సంజయ్‌ ఫైర్ అయ్యారు. కేంద్రం పెత్తనం ఏంటని అనేది కేసీఆరే.. మళ్లీ కేంద్రం ధాన్యం కొనడం లేదని అనేది కేసీఆరే అంటూ విమర్శించారు. వరి కొంటామని కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసిందన్నారు. ఆగస్టు 31 న కేంద్రం లేఖ రాసిందన్నారు. కేంద్రం లేఖ రాయలేదని సీఎం కేసీఆర్ అబద్దాలు చెప్పారని అన్నారు.  కేంద్రం పంపిన లెటర్ కేసీఆర్‌కు వచ్చిందా.. రాలేదా.. అని ప్రశ్నించారు.

ఒకసారి రవి వేయొద్దని, ఇంకోసారి పత్తి వేయొద్దని రైతులను గందరగోళ పరిచారని విమర్శించారు. కేసీఆర్ ఢిల్లీకి పోతే రైతులు తరిమికొడతారని అన్నారు.  రైతు చట్టాల విషయంలో కేసీఆర్‌ది పూటకో మాట మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కొత్త వ్యవసాయ చట్టాల్లో మార్కెటింగ్ కమిటీల రద్దు ప్రస్తావన లేదని అన్నారు. 62 లక్షల ఎకరాల్లో వరి ఎక్కడ సాగవుతుందో సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రేషన్ బియ్యం విషయంలో టీఆర్‌ఎస్ తాబేదార్లు రీసైక్లింగ్ చేశారని ఆరోపించారు. రైతు మిల్లర్లతో కుమ్మకై పెద్ద స్కాం చేశారని విమర్శించారు. రుణమాఫీ ఇస్తానని చెప్పి మోసం చేశారని.. మూడేళ్లు గడుస్తున్న ఎక్కడ చేయలేదని అన్నారు. సీఎం సొంత జిల్లా సిద్దిపేటలోనే రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని అన్నారు. కేసీఆర్ ఫెడరల్ ఫ్రెంట్ అని ఢిల్లీకి పోతే ఎవరూ పట్టించుకోరని అన్నారు. మందు తాగి బండి నడిపితే తప్పైనప్పుడు.. మందు తాగి రాష్ట్రాన్ని నడిపితే తప్పు కాదు తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. 

Also read: కళ్లు నెత్తికెక్కాయా, టచ్ చేసి చూడు.. బిడ్డా బతుకుతావా: బండి సంజయ్‌కి కేసీఆర్ వార్నింగ్

రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ పెంచలేదని కేసీఆర్ అబద్దాలు చెప్పారని అన్నారు. 24 రాష్ట్రాలు తగ్గించినప్పుడు.. తెలంగాణ ఎందుకు తగ్గించదని ప్రశ్నించారు. పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీలో చేరుస్తామంటే ఎందుకు వద్దంటున్నారని ప్రశ్నించారు. 2015లో పెట్రోల్‌పై 4 శాతం, డీజిల్‌పై 5 శాతం వ్యాట్ పెంచలేదా అని ప్రశ్నించారు. లీటర్‌పై కేంద్రానికి రూ. 27 వస్తే రాష్ట్రానికి రూ. 28 వస్తోందన్నారు. కేంద్రానికి వెళ్లే రూ. 27‌లో మళ్లీ రాష్ట్రానికి రూ. 12 తిరిగి వస్తాయి.. ఇది వాస్తమని చెప్పుకొచ్చారు. సీఎం స్థాయి వ్యక్తి ఇలా అబద్దాలు చెప్పొచ్చా అని అడిగారు. అబద్దాల కోసమే కేసీఆర్ ఒక శాఖ పెట్టుకున్నారని.. దాని బాధ్యతలను హరీశ్‌రావుకు అప్పగించారని విమర్శించారు. 

ఇంగ్లిష్, హిందీ తనకు రాదని కేసీఆర్ అంటున్నారని.. పెద ప్రజల మనుసులో బాధలను, కష్టాలను తాను చదువుకున్నానని అన్నారు. తనను మెడలు నరుకుతానని కేసీఆర్ అన్నాడని.. ఆయన ఎప్పుడు నరుకుతాడో చెప్పితే వెళ్తే దమ్ము తనకు ఉందన్నారు.

click me!