ఈటల రాజేందర్‌పై భూ కబ్జా ఆరోపణల కేసు.. ఈ నెల 16న విచారణ..

By team teluguFirst Published Nov 8, 2021, 1:22 PM IST
Highlights

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై (Etela Rajender) భూ కబ్జా ఆరోపణలకు సంబంధించిన కేసు విచారణను వేగవంతం అయింది.  హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 16న విచారణ చేపట్టనున్నారు. 

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై (Etela Rajender) భూ కబ్జా ఆరోపణలకు సంబంధించిన కేసు విచారణను వేగవంతం అయింది.  హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 16న విచారణ చేపట్టనున్నారు. ఈటల రాజేందర్ సతీమణి జమునా రెడ్డికి చెందిన జమున హెచరీస్‌కు గతంలోనే నోటీసులు జారీ అయినట్టుగా తెలుస్తోంది. జూన్‌లోనే నోటీసులు జారీచేసిన డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వే నోటీసులు జారీచేసినట్టుగా చెబుతున్నారు. కోవిడ్ దృష్ట్యా హైకోర్టు ఆదేశాలతో సర్వే వాయిదా పడింది. ప్రస్తుతం కోవిడ్ తీవ్రత తగ్గిన నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలతో 16న పూర్తిస్థాయిలో విచారణ జరుగనుంది.

మొదక్ జిల్లాలో భూకబ్జాలకు పాల్పడినట్టుగా గతంలో ఈటల రాజేందర్‌పై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేట గ్రామాల్లో వంద మంది రైతులకు చెందిన వంద ఎకరాలను ఇప్పటికే ఈటల అనుచరులు ఆక్రమించారంటూ బాధితులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ విచారణకు ఆదేశించారు. అయితే ఈ ఆరోపణలను ఈటల ఖండించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఆయన టీఆర్‌ఎస్ పార్టీకి, తన మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.

Also read: ‘‘నన్నే ఆపుతావారా?’’...సీఐపై నోరు పారేసుకున్న ఎమ్మెల్యే గువ్వల బాలరాజు...

తమ హెచరీస్, గోదాములపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఈటల కుటుంబం తెలిపింది. వారిపై వస్తున్న ఆరోపణలను ఈటల రాజేందర్ సతీమణి జమన ఖండించారు. ‘మెదక్‌ జిల్లా మాసాయిపేటలో 46 ఎకరాలు కొనుగోలు చేశాం. కానీ మేము బడుగు బలహీనవర్గాల భూమి కాజేశామని దుష్ప్రచారం చేస్తున్నారు. 1992లో దేవరయాంజల్‌ వచ్చి 1994లో అక్కడి భూములు కొన్నాం. దేవుడి భూమి అయితే బ్యాంకులు ఎలా అప్పు ఇచ్చాయి?. 46 ఎకరాల కన్నా ఒక్క ఎకరం భూమి ఎక్కువగా ఉన్నట్టు నిరూపిస్తే ముక్కు నెలకు రాస్తా.. లేకుంటే అధికారులు ముక్కు నేలకు రాస్తారా?’అని గతంలోనే జమున సవాలు విసిరారు.
 

click me!