Bandi Sanjay: కేసీఆర్ రాజకీయ పతనం మొదలైంది.. సొంత పనుల కోసమే ఢిల్లీ వెళ్లారు.. కేసీఆర్‌పై బండి సంజయ్ ఫైర్..

Published : Nov 27, 2021, 11:42 AM ISTUpdated : Nov 27, 2021, 11:47 AM IST
Bandi Sanjay: కేసీఆర్ రాజకీయ పతనం మొదలైంది.. సొంత పనుల కోసమే ఢిల్లీ వెళ్లారు.. కేసీఆర్‌పై బండి సంజయ్ ఫైర్..

సారాంశం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) రాజకీయ పతనం (political downfall) మొదలైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ సొంత పనుల కోసమ ఢిల్లీ వెళ్లారని ఆరోపించారు. 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ పతనం మొదలైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయం ఓ జ్యోతిష్కుడు చెప్పాడన్నారు. కేంద్ర మంత్రుల అపాయింట్‌మెంట్ లేకుండానే కేసీఆర్ ఢిల్లీ వెళ్లారని అన్నారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో బండి సంజయ్ మాట్లాడుతూ కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అపాయింట్‌మెంట్ లేకుండానే తెలంగాణ మంత్రులు ఢిల్లీకి వెళ్లారని అన్నారు. కేసీఆర్ సొంత పనుల కోసమ ఢిల్లీ వెళ్లారని ఆరోపించారు. 

అపాయిట్ మెంట్ పేరుతో బీజేపీపై నెపం నెట్టేందుకు టీఆర్‌ఎస్ ప్రయత్నిస్తుందని విమర్శించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉంటుందా..? పోతుందా..? అనే గ్యారెంటీ లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో అవినీతి రాజ్యమేలుతోందని.. నియంత, కుటుంబ పాలన కొనసాగుతోందన్నారు. అవినీతి, నియంత, కుటుంబ పాలనను తెలంగాణ ప్రజలు సహించరని చెప్పారు. బీజేపీని బద్నాం చేయాలని కేసీఆర్ కుట్ర చేస్తున్నారని విమర్శించారు. ప్రజల దృష్టి మరల్చేందుకే కేసీఆర్ ఢిల్లీ టూర్ అని ఎద్దేవా చేశారు. బీజేపీని నవ్వులపాలు చేయాలనే నీచమైన కుట్రకు కేసీఆర్ పాల్పడ్డారని విమర్శించారు. త్వరలోనే తెలంగాణ తల్లికి విముక్తి కాబోతుందని.. బీజేపీతోనే అది సాధ్యం కాబోతుందన్నారు.

Also read: టీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి టచ్ లో 25 మంది నేతలు.. తరుణ్ చుగ్

మరోవైపు తెలంగాణ రాజకీయాలపై బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి తరుణ్ చుగ్ శుక్రవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి KCR కు ఢిల్లీలో షాక్ తగిలిందని tarun chugh అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఇప్పటికిప్పుడు electionsలు వచ్చినా కేసీఆర్ కు 60 మంది అభ్యర్థులు కూడా దొరకరని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, తెరాస నుంచి 25 మంది నేతలు టచ్ లో ఉన్నారని స్పష్టం చేశారు. 

తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీ 80 స్థానాలు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలు వస్తే, తమ సత్తా తెలుస్తుందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీదీ ముగిసిన అధ్యాయమన్నారు. వ్యవసాయ చట్టాల రద్దుతో ఒక వర్గం రైతులు బాధపడ్డారని, చట్టాలు అమల్లోకి వస్తే చాలా బాగుండేదన్నారు.  దీనిని అమలు చేస్తే, పెద్ద సంఖ్యలో రైతులు ప్రయోజనం పొందుతారని తరుణ్ చుగ్ అభిప్రాయపడ్డారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు