Shilpa Chowdary: శిల్పా చౌదరి వలలో టాలీవుడ్ హీరోలు.. వీకెండ్ పార్టీలు ఇచ్చి సెలబ్రిటీలతో స్నేహం పెంచుకుని..

Published : Nov 27, 2021, 10:46 AM ISTUpdated : Nov 27, 2021, 01:12 PM IST
Shilpa Chowdary: శిల్పా చౌదరి వలలో టాలీవుడ్ హీరోలు.. వీకెండ్ పార్టీలు ఇచ్చి సెలబ్రిటీలతో స్నేహం పెంచుకుని..

సారాంశం

హైదరాబాద్‌లో ప్రముఖులను మోసం చేస్తున్న వ్యాపారవేత్త శిల్పా చౌదరిని (Shilpa Chowdary) పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె బాధితుల్లో టాలీవుడ్ (tollywood) హీరోలు కూడా ఉన్నారు. ప్రముఖ టాలీవుడ్ నటుడు (Tollywood actor), అతని భార్య శుక్రవారం రాత్రి శిల్ప చౌదరిపై మహిళపై ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

హైదరాబాద్‌లో ప్రముఖులను మోసం చేస్తున్న శిల్పా చౌదరి(Shilpa Chowdary) అనే మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తల, ప్రజా ప్రతినిధుల నుంచి శిల్ప డబ్బులు తీసుకుని మోసం చేసిందనే ఫిర్యాదులు రావడంతో నార్సింగి పోలీసులు (Narsingi police) చర్యలు తీసుకున్నారు. శిల్ప తన వద్ద నుంచి కోటి రూపాయలకు పైగా డబ్బులు తీసుకుని తిరిగి ఇవ్వలేదని దివ్య అనే మహిళ  నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు..గండిపేట సిగ్నేచర్ విల్లాస్‌లో నివాసం ఉంటున్న శిల్ప, ఆమె భర్త శ్రీనివాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకన్నారు. ఈ క్రమంలోనే దివ్య వద్ద నుంచి శిల్ప డబ్బులు తీసుకుని చెల్లించలేదని పోలీసులు నిర్దారించుకున్నారు. అనంతరం వారిద్దరని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.  


శిల్ప బాధితుల్లో ముగ్గురు టాలీవుడ్ హీరోలు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. వీకెండ్ పార్టీలు, కిట్టి పార్టీల పేరుతో సెలబ్రిటీలతో స్నేహం చేసిన శిల్ప.. అధిక వడ్డీ రేట్లు ఇస్తానని చెప్పి రూ. 100 కోట్ల నుంచి రూ. 200 కోట్ల వరకు దండుకుని మోసం చేసినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. శిల్పను పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుసుకున్న పలువురు బాధితులు ఆమెపై ఫిర్యాదు చేసేందుకు క్యూ కట్టినట్టుగా తెలుస్తోంది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ‘శిల్ప చౌదరి తన బంధువుకు చెందిన ఉన్నత పాఠశాలలో పెట్టుబడి పెడతానని తప్పుడు వాగ్దానంతో కొందరి నుంచి డబ్బలు సేకరించింది. మరికొన్ని సందర్భాల్లో అధిక వడ్డీకి హామీ ఇచ్చి పలువురి నుంచి డబ్బు వసూలు చేసింది. బాధితులను ఆమె ఇప్పటి వరకు కోట్లాది రూపాయల మేర మోసం చేసింది’ అని తెలిపారు. 

ఇందుకు సంబంధించి గత వారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన నార్సింగి పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే పోలీసులు ఆమెను విచారించి.. శుక్రవారం రాత్రి అరెస్ట్ చేశారు. శిల్ప చౌదరి బాధితుల్లో నటులు మరియు బ్యూరోక్రాట్‌లతో సహా ఉన్నత స్థాయి వ్యక్తులు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక, ప్రముఖ టాలీవుడ్ నటుడు (Tollywood actor), అతని భార్య కూడా శుక్రవారం రాత్రి మహిళపై ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఆమెపై మరిన్ని ఫిర్యాదులు నమోదయ్యే అవకాశం ఉందని పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Drunk & Drive Test in Ramagundam: పోలీసులకు చుక్కలు చూపించిన మందుబాబులు| Asianet News Telugu
Hyderabad : జీరో మైలురాయి ఎక్కడుంది.. హైదరాబాద్ దూరాన్ని ఎక్కడినుండి కొలుస్తారో తెలుసా..?