Huzuarabad By Poll : హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా బల్మూరు వెంకట్..

By AN TeluguFirst Published Oct 2, 2021, 8:06 AM IST
Highlights

రాష్ట్ర ఎన్ఎస్ యూఐ అధ్యక్షుడిగా బల్మూరు వెంకట్ రెండు పర్యాయాలుగా పనిచేస్తున్నారు. వెంకట్ పేరును ప్రతిపాదించే ముందు పార్టీ ముఖ్యలు ఆయనను పిలిచి అభిప్రాయం తీసుకున్నారు. 

హుజూరాబాద్ ఉప ఎన్నికకు(Huzuarabad By Poll) కాంగ్రెస్ అభ్యర్థి (congress candidate)ఖరారయ్యారు. ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరు వెంకట్ (వెంకట నర్సింగరావు) (balmoor venkat) పేరును పార్టీ ఖరారు చేసింది. అధిష్టానం ఆమోదం అనంతరం పేరును ప్రకటించే అవకాశం ఉంది. అభ్యర్థి ఎంపికమీద శుక్రవారం జరిగిన చర్చలో పలువురి పేర్లు పరిశీలనకు వచ్చినా.. అధికార టీఆర్ఎస్ తరఫున ఆ పార్టీ విద్యార్థి నాయకుడిని అభ్యర్థిగా నిలబెడుతున్న నేపథ్యంలో బల్మూరు వెంకట్ పేరును కాంగ్రెస్ ముఖ్యులు ప్రతిపాదించారు. 

రాష్ట్ర ఎన్ఎస్ యూఐ అధ్యక్షుడిగా బల్మూరు వెంకట్ రెండు పర్యాయాలుగా పనిచేస్తున్నారు. వెంకట్ పేరును ప్రతిపాదించే ముందు పార్టీ ముఖ్యలు ఆయనను పిలిచి అభిప్రాయం తీసుకున్నారు. శుక్రవారం అర్థరాత్రి వరకు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి, ప్రచార కమిటీ చైర్మన్ దామోదర్ రాజ నర్సింహ తదితరులతో చర్చించిన అనంతరం ఖరారు చేశారు. శనివారం టీపీసీసీ చేపట్టనున్న విద్యార్థి, నిరుద్యోగ సైరన్ సందర్భంగా వెంకట్ పేరును ప్రకటించవచ్చని భావిస్తున్నారు.

హుజురాబాద్ ఉప ఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమయ్యింది. శుక్రవారం తొలిరోజు రెండు నామినేషన్లు దాఖలయ్యాయి. అధికార టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ తన నామినేషన్ ను దాఖలు చేశారు. ఆయన వెంట రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షఉడు బి. వినోద్ కుమార్, మాజీమంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి ఉన్నారు. కాగా, వైఎస్ఆర్ పార్టీ పేరిట మహ్మద్ మన్సూర్ అలీ అనే మరో వ్యక్తి కూడా నామినేషన్ దాఖలు చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి సీహె. రవీందర్ రెడ్డి తెలిపారు. 

ఇదిలా ఉండగా, జాతీయ ఉపాధి హామీ పథకం పనుల విధుల నుంచి రాస్ట్ర ప్రభుత్వం తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్లు పెద్ద సంఖ్యలో హుజూరాబాద్ ఉప ఎన్నికలో నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు. తద్వారా ప్రభుత్వానికి తమ నిరసనను తెలపాలని భావిస్తున్నారు. ఉపాధి హీమీ పథకంలో 15 యేళ్లుగా పని చేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లను రాష్ట్ర ప్రభుత్ం నిరుడు తొలగించింది. 

దీంతో వారు తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ ఉద్యమాలు చేస్తున్నారు. అయినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో హూజూరాబాద్ ఉప ఎన్నికను తమ నిరసనకు వేదికగా చేసుకోవాలని ఫీల్డ్ అసిస్టెంట్లు నిర్ణయించుకున్నారు. వెయ్యి మందికి పైగా నామినేషన్లు వేస్తామని చెబుతున్నారు. ఈ మేరకు శుక్రవారం మహబూబాబాద్ జిల్లాలోని తహసీల్దార్ కార్యాలయాల్లో 12 మంది డిక్లరేషన్ ఫారాలు తీసుకున్నారు. ఖమ్మం జిల్లా నుంచి 70 మంది దాకా ఈ నెల 4,5 తేదీల్లో నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు హూజూరాబాద్ లో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బి. మహేష్ బాబు ప్రకటించారు. 

Huzuarabad By Poll: ప్రచారంపై అధికార పార్టీ ఫోకస్... టీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్లు వీరే

ఉప ఎన్నిక జరగనున్న హూజూరాబాద్ నియోజక వర్గంలో మాత్రమే ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని ఎన్నికల సంఘం స్పష్టత ఇచ్చిందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హూజూరాబాద్ నియోజకవర్గంలోని గ్రామాలు హన్మకొండ, కరీంనగర్ జిల్లాల పరిధిలో ఉన్నాయని, ఆ గ్రామాల పరిధిలో మాత్రమే ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని వివరించారు. ఇదిలా ఉండగా, హూజూరాబాద్ ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ తరఫున 20మందిని ప్రచారకర్తలుగా ఆపార్టీ ప్రకటించింది. వారి పేర్లతో కూడిన జాబితాను సీఈవో శశాంక్ గోయల్ కు టీఆర్ఎస్ నేతలు అందజేశారు. సీఎం కేసీఆర్ తోపాటు మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, కొప్పుల ఈశ్వర్, గంగలు కమలాకర్ తదితరులు ఆ జాబితాలో ఉన్నారు. 

హూజూరాబాద్ నియోజకవర్గ ప్రజుల ఒక్కసారి అవకాశం ఇవ్వాలని, గ్రామాలను అభివృద్ధి చేస్తానని టీఆరఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని ఉప్పల్, ఉప్పలపల్లి, భీంపల్లి గ్రామాల్లో ప్రభుత్వ విప్ బాల్క సుమన్ తో కలిసి ఆయన ింటింటి ప్రచారం నిర్వహించారు. మంత్రిగా ఉణ్నప్పుడే అభివృద్ధి చేయలేని ఈటల.. ఎమ్మెల్యేగా ఏం చేస్తారని ప్రశ్నించారు.

తనను గెలిపిస్తే సీఎంతో మాట్లాడి ప్రత్యేక నిధులు తీసుకొచ్చి గ్రామాలన్నింటినీ అభివృద్ధి చేస్తానన్నారు. డబుల్ బెడ్ రూం ఇల్లు కట్టిస్తానని, నియోజకవర్గానికి మెడికల్ కాలేజీ తీసుకొస్తానని హామీ ఇచ్చారు. 

click me!