కాళేశ్వరం ప్రాజెక్టు: తెలంగాణ సర్కార్‌కు షాక్.. మూడో టీఎంసీ పనులపై హైకోర్టులో పిల్‌

Siva Kodati |  
Published : Oct 01, 2021, 10:03 PM IST
కాళేశ్వరం ప్రాజెక్టు: తెలంగాణ సర్కార్‌కు షాక్.. మూడో టీఎంసీ పనులపై హైకోర్టులో పిల్‌

సారాంశం

కాళేశ్వరం ప్రాజెక్టు మూడో టీఎంసీ పనుల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వానికి షాక్ తగిలింది. ఈ ప్రాజెక్ట్ పనులకు సంబంధించి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.

కాళేశ్వరం ప్రాజెక్టు మూడో టీఎంసీ పనుల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వానికి షాక్ తగిలింది. ఈ ప్రాజెక్ట్ పనులకు సంబంధించి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. సిద్దిపేట జిల్లా తుక్కాపూర్‌కు చెందిన శ్రీనివాసరెడ్డి ఈ పిల్‌ దాఖలు చేశారు. మూడో టీఎంసీకి అనుమతులు లేకుండానే పనులు చేపట్టారని పిటిషనర్ కోర్టుకు తెలియజేశారు.కేంద్రం, ఎన్జీటీ ఆదేశాలకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం పనులు నిర్వహిస్తోందని ఆరోపించారు. ఈ పిల్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. పనులు నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. అనంతరం తదుపరి విచారణను నాలుగువారాలకు వాయిదా వేసింది.  
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Kavitha: ఇక స‌మ‌ర‌మే.. ఎన్నిక‌ల బ‌రిలోకి దిగుతోన్న క‌విత‌. తండ్రి కారు అయితే కూతురు..?
Money Earning Tips : మేడారం జాతరలో పెట్టుబడి లేకుండానే లక్షలు సంపాదించండి.. టాప్ 5 బిజినెస్ చిట్కాలు