Disha Accused Encounter Case : కళ్లలో మట్టి కొట్టి, పిస్తోల్ లాక్కుని.. చటాన్ పల్లి ప్రత్యక్ష సాక్షి వాంగ్మూలం

Published : Oct 02, 2021, 07:33 AM IST
Disha Accused Encounter Case : కళ్లలో మట్టి కొట్టి, పిస్తోల్ లాక్కుని.. చటాన్ పల్లి ప్రత్యక్ష సాక్షి వాంగ్మూలం

సారాంశం

వస్తువులు వెతికే క్రమంలో అరిఫ్ రెండు చేతులతో మట్టి విసరడంతో 12మంది కళ్ళలో పడిందని చెప్పారు. తర్వాత నిందితులు రాళ్లు, కర్రలతో దాడి చేశారని పేర్కొన్నారు. ఆరిఫ్, చెన్నకేశవులు సీఐ,ఎస్సైల నుంచి ఆయుధాలు లాక్కునేందుకు ప్రయత్నించారని పేర్కొన్నారు. అంత మంది పోలీసులు నిందితులని నిలువరించే ప్రయత్నం చేయలేదా? అని న్యాయవాదులు  ప్రశ్నించారు. తన కళ్ళలో మట్టి పడడంతో తాను గమనించ లేదని రవూఫ్  చెప్పారు. కాల్పులు జరిగిన సమయంలో మీరు ఎంత దూరంలో ఉన్నారు? అని అడిగితే మూడు, నాలుగు అడుగుల దూరంలో ఉన్నాను.. అని బదులిచ్చారు.

హైదరాబాద్ : ‘దిశ’ అత్యాచారం కేసు నిందితుల ఎన్కౌంటర్ (Disha Accused Encounter Case) ఉదంతంపై అబ్దుల్ రవూఫ్ అనే ప్రత్యక్షసాక్షి శుక్రవారం జస్టిస్ సిర్పూర్ కమిషన్ (Sirpurkar Commission)ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. కమిషన్ తరపు న్యాయవాదులు పరమేశ్వర్, విరూపాక్ష గౌడ అడిగిన ప్రశ్నలకు రవూఫ్ సమాధానాలిచ్చారు. దిశకు సంబంధించిన వస్తువులున్న  ప్రాంతాన్ని చూపిస్తానని నిందితుడు చెప్పడంతో పోలీసులు వెంట తానూ చటాన్ పల్లికి (Chatanpally) వెళ్లానని చెప్పారు.

వస్తువులు వెతికే క్రమంలో అరిఫ్ రెండు చేతులతో మట్టి విసరడంతో 12మంది కళ్ళలో పడిందని చెప్పారు. తర్వాత నిందితులు రాళ్లు, కర్రలతో దాడి చేశారని పేర్కొన్నారు. ఆరిఫ్, చెన్నకేశవులు సీఐ,ఎస్సైల నుంచి ఆయుధాలు లాక్కునేందుకు ప్రయత్నించారని పేర్కొన్నారు. అంత మంది పోలీసులు నిందితులని నిలువరించే ప్రయత్నం చేయలేదా? అని న్యాయవాదులు  ప్రశ్నించారు. తన కళ్ళలో మట్టి పడడంతో తాను గమనించ లేదని రవూఫ్  చెప్పారు. కాల్పులు జరిగిన సమయంలో మీరు ఎంత దూరంలో ఉన్నారు? అని అడిగితే మూడు, నాలుగు అడుగుల దూరంలో ఉన్నాను.. అని బదులిచ్చారు.

ఈ సందర్భంగా న్యాయవాదులు ఘటనాస్థలి ఫోటోలను చూపించి ఆ ప్రాంతాన్ని గుర్తుపట్టమని అడిగారు.  నిందితుల వాంగ్మూలంలో లేని విషయాలు మీ స్టేట్మెంట్ లో ఎందుకున్నాయని ప్రశ్నించగా..  దానిని ఎలా నమోదు చేసుకున్నారో తనకు తెలియదని అన్నారు.

‘దిశ’ కేసు నిందితుల ఎన్ కౌంటర్ ఉదంతంపై త్రిసభ్య కమిషన్ జరుగుతున్న విచారణలో చొరబాటు యత్నం జరిగింది.  కమిషన్ సభ్యులు  ఢిల్లీ,  ముంబైల నుంచి ఆన్లైన్లో విచారణ జరుపుతుండగా..  సాక్షులు తెలంగాణ హైకోర్టు నుంచి హాజరవుతున్నారు.  శుక్రవారం  కమిషన్ కంప్యూటర్ పై  పాప్ అప్ నోటిఫికేషన్లు ప్రత్యక్షమయ్యాయి.

Disha accused encounter: సిర్పూర్కర్ కమిషన్‌కి డ్రైవర్ వింత సమాధానాలు

గుర్తుతెలియని వ్యక్తులు ఆన్ లైన్ విచారణలో చొరబాటుకు యత్నిస్తున్నట్లు గా అనుమానించిన కమిషన్ వెంటనే అప్రమత్తం అయ్యింది.  ఎంక్వైరీ ప్రోసిడింగ్ లను యాక్సెస్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారనే అనుమానంతో విషయాన్ని విచారణను పర్యవేక్షిస్తున్న కమిషన్ కార్యదర్శి శశిధర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లింది. చొరబాటుకు యత్నంపై దర్యాప్తు చేయాలని స్టేట్ కౌన్సిల్ ఉమామహేశ్వరరావుకు సూచించింది. హైకోర్టు ప్రాంగణంలో ఉన్న వైఫై పాస్ వర్డ్ ను ఇతరులు వినియోగించడం వల్ల  ఇలా జరిగి ఉంటుందనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి.

కాల్పుల సమయంలో ఏ వైపు ఉన్నారని అడిగిన ప్రశ్నకు రవూఫ్ తూర్పున అని చెప్పారు.  ఓ న్యాయవాది పశ్చిమం అని చెప్పడంతో వెంటనే రవూఫ్ ఆ మాట మార్చారు.  ఈ విషయంలో ఆ న్యాయవాది మీద కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.  దీనిపై వెరిఫై చేయాలని ఆదేశించింది.  అంతకుముందు గాంధీ ఆస్పత్రి ఫోరెన్సిక్ నిపుణుడు కృపాల్ సింగ్ ను న్యాయవాదులు విచారించారు.  ‘పాయింట్ రేంజ్ ఫైరింగ్’ గురించి తెలుసా అని అడిగితే బాలిస్టిక్ నిపుణులకే ఆ విషయం తెలుస్తుంది అన్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Pensions: తెలంగాణ‌లో రూ. 4 వేలకి పెర‌గ‌నున్న‌ పెన్ష‌న్‌.. ఎప్ప‌టి నుంచి అమ‌లు కానుంది? ప్ర‌భుత్వం ప్లాన్ ఏంటి.?
School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే