నా ఫోటోతో చాలామంది గెలిచారు... శ్రీలంకలోనైనా పోటీకి రెడీ: బాబూమోహన్

sivanagaprasad kodati |  
Published : Oct 02, 2018, 08:49 AM IST
నా ఫోటోతో చాలామంది గెలిచారు... శ్రీలంకలోనైనా పోటీకి రెడీ: బాబూమోహన్

సారాంశం

వచ్చే ఎన్నికల్లో  బీజేపీ అధిష్టానం ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి పోటీ చేస్తానన్నారు మాజీ మంత్రి, సినీనటుడు బాబూమోహన్. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన తాను బీజేపీలో చేరడానికి గల కారణాలను త్వరలోనే వివరిస్తానని.. బీజేపీ నాయకత్వం చెప్పింది చేస్తానని.. చివరికి శ్రీలంకలో పోటీ చేయమన్నా చేస్తానని బాబూ మోహన్ అన్నారు

వచ్చే ఎన్నికల్లో  బీజేపీ అధిష్టానం ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి పోటీ చేస్తానన్నారు మాజీ మంత్రి, సినీనటుడు బాబూమోహన్. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన తాను బీజేపీలో చేరడానికి గల కారణాలను త్వరలోనే వివరిస్తానని.. బీజేపీ నాయకత్వం చెప్పింది చేస్తానని.. చివరికి శ్రీలంకలో పోటీ చేయమన్నా చేస్తానని బాబూ మోహన్ అన్నారు.

శ్రీలంకలో తనకు చాలామంది అభిమానులు ఉన్నారని.. తన ఫోటో పెట్టుకుని ఎంతోమంది మున్సిపల్ ఎన్నికల్లో గెలిచారని ఆయన పేర్కొన్నారు. బీజేపీలో చేరిన తర్వాత మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయను బాబూమోహన్ మర్యాదపూర్వకంగా కలిశారు.

గత ఎన్నికలకు ముందు టీఆర్ఎస్‌లో చేరిన బాబూ మోహన్.. అంథోల్‌ నుంచి పోటీ చేసి గెలిచారు. అయితే ఈసారి సీఎం కేసీఆర్ తనకు టికెట్ కేటాయించకపోవడం పట్ల బాబూమోహన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో టీఆర్ఎస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు.

టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాబూ మోహన్ కు చేదు అనుభవం

బాబు మోహన్ కి చుక్కలు చూపించిన గ్రామస్థులు

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
Hyderabad: ఇది పూర్త‌యితే హైద‌రాబాద్‌లో దేశంలో టాప్ సిటీ కావ‌డం ఖాయం.. ORR చుట్టూ మెగా ప్రాజెక్ట్‌