ఆటో డ్రైవర్ పై అల్లరిమూకల దాడి: నిందితుల అరెస్ట్

Published : Oct 01, 2018, 09:28 PM IST
ఆటో డ్రైవర్ పై అల్లరిమూకల దాడి: నిందితుల అరెస్ట్

సారాంశం

హైదరాబాద్ లో ఆదివారం రాత్రి అల్లరిమూకలు రెచ్చిపోయారు. ఆటోలో ప్రయాణిస్తున్నఓ ప్రయాణికుడిపై మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. అడ్డు వచ్చిన ఆటో డ్రైవర్ పైనా విచక్షణా రహితంగా దాడి చేశారు. వివరాల్లోకి వెళ్తే మాదన్నపేట్ కి చెందిన అర్జున్ ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోసిస్తున్నాడు. ఆదివారం తన స్నేహితులైన విజయ్, ప్రసాద్ లను సింగరేణిలో దింపేందుకు ఆటోలో వెళ్లారు.

హైదరాబాద్: హైదరాబాద్ లో ఆదివారం రాత్రి అల్లరిమూకలు రెచ్చిపోయారు. ఆటోలో ప్రయాణిస్తున్నఓ ప్రయాణికుడిపై మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. అడ్డు వచ్చిన ఆటో డ్రైవర్ పైనా విచక్షణా రహితంగా దాడి చేశారు. వివరాల్లోకి వెళ్తే మాదన్నపేట్ కి చెందిన అర్జున్ ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోసిస్తున్నాడు. ఆదివారం తన స్నేహితులైన విజయ్, ప్రసాద్ లను సింగరేణిలో దింపేందుకు ఆటోలో వెళ్లారు.

తన స్నేమితుడు ప్రసాద్ ను సింగరేణి దగ్గర దించి విజయ్ తో కలిసి అర్జున్ తిరిగి పయనమయ్యారు. అయితే మార్గ మధ్యలో కొందరు యువకులు దాడి చేశారు. తన స్నేహితుడిపై దాడికి పాల్పడటంతో అర్జున్ అడ్డుకున్నారు. అర్జున్ ను సైతం అల్లరి మూకలు విడిచిపెట్టలేదు. ఇద్దరిని తీవ్రంగా కొట్టి అక్కడ నుంచి పరారయ్యారు. తీవ్ర గాయాలపాలైన అర్జున్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.  

గాయాలపాలైన అర్జున్ ను చికిత్సనిమిత్తం పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దాడికి పాల్పడిన వారిని గుర్తించారు. నిందితులు సింగరేణి కాలనీకి చెందిన లక్ష్మణ్,గోపి,మహేష్,పవన్ లుగా గుర్తించిన పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. 

PREV
click me!

Recommended Stories

Hyderabad Holi Celebrations 2026 at Tank Bund: హైదరాబాద్‌లో ఘనంగా హోలీ సంబరాలు| Asianet News Telugu
Ayatollah Ali Khamenei: ఖమేనీకి మద్దతుగా హైదరాబాద్ లో క్యాండిల్ ర్యాలీ| Asianet News Telugu