ఆ విషయంలో రూ.89కోట్ల నిధులతో.. ప్రాంతీయ పార్టీల్లో టీఆర్ఎస్సే టాప్.. ఏడీఆర్ నివేదిక..

By AN TeluguFirst Published Nov 12, 2021, 11:56 AM IST
Highlights

తమకు తెలియని మూలాల నుంచి ఆదాయాన్ని ఆర్జించిన కొన్ని పెద్ద ప్రాంతీయ పార్టీలు వరుసగా టీఆర్‌ఎస్‌ రూ.89 కోట్లు, టీడీపీ రూ.81.6 కోట్లు, జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్‌ఆర్‌సీ రూ.74.7 కోట్లు, నవీన్‌ పట్నాయక్‌కు చెందిన బిజూ జనతాదళ్‌ రూ.50.5 కోట్లు, ఎంకే. స్టాలిన్ డీఎంకే రూ.45.5 కోట్లు.

హైదరాబాద్ : తెలంగాణ, దాని పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని మూడు పెద్ద ప్రాంతీయ పార్టీలైన టిఆర్ఎస్, టిడిపి, వైఎస్ఆర్ కాంగ్రెస్ లు  2019-20లో తమ నిధులలో ఎక్కువ భాగాన్ని 'గుర్తు తెలియని సోర్స్' నుండి స్వీకరించాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) ఒక నివేదికలో తెలిపింది.

ADR, ఎన్నికల, రాజకీయ సంస్కరణల మీద పనిచేసే NGO.. ఇది తెలిపిన వివరాల ప్రకారం unknown sourcesనుండి ప్రాంతీయ పార్టీలకు వచ్చిన మొత్తం ఆదాయం రూ. 446 కోట్లుగా ఉంది. ఇది 2019-20లో వారి మొత్తం ఆదాయంలో 55 శాతం. ఆర్థిక సంవత్సరంలో 25  regional political partyల మొత్తం ఆదాయం రూ.803 కోట్లు.

తమకు తెలియని మూలాల నుంచి ఆదాయాన్ని ఆర్జించిన కొన్ని పెద్ద ప్రాంతీయ పార్టీలు వరుసగా టీఆర్‌ఎస్‌ రూ.89 కోట్లు, టీడీపీ రూ.81.6 కోట్లు, జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్‌ఆర్‌సీ రూ.74.7 కోట్లు, నవీన్‌ పట్నాయక్‌కు చెందిన బిజూ జనతాదళ్‌ రూ.50.5 కోట్లు, ఎంకే. స్టాలిన్ డీఎంకే రూ.45.5 కోట్లు.

“వారి ఆదాయపు పన్ను రిటర్న్‌లు, ఎన్నికల కమిషన్‌లో దాఖలు చేసిన donation statementsలో డబ్బులు వచ్చిన సోర్సులు ఎక్కువ వరకు unknown అని చూపిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం రాజకీయ పార్టీలు రూ.20,000 లోపు ఇచ్చే వ్యక్తులు లేదా సంస్థల పేరును వెల్లడించాల్సిన అవసరం లేదు. ఫలితంగా, పార్టీలు చూపించే నిధుల్లో గణనీయమైన మొత్తంలో నిధులు ఎక్కడి నుంచి వచ్చాయో కనిపెట్టడం సాధ్యం కాదని, అవి ‘అన్ నోన్’ సోర్సుల నుండి వచ్చినవి” అని ADR తెలిపింది.

ఉమ్మడి నల్గొండ జిల్లాలో త్వరలోనే ఉప ఎన్నికలు: బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలనం

53 ప్రాంతీయ పార్టీల్లో కేవలం 28 పార్టీలు మాత్రమే తమ వార్షిక ఆడిట్, కంట్రిబ్యూషన్ రిపోర్టులను దాఖలు చేశాయని పేర్కొంది. మిగిలిన 16 పార్టీలు ఏ ఒక్క నివేదికను సమర్పించలేదు. ECI వెబ్‌సైట్‌లో తొమ్మిది ప్రాంతీయ పార్టీల రెండు నివేదికలు ఏవీ అందుబాటులో లేవు.

AAP, లోక్ జనశక్తి పార్టీ (బీహార్), IUML వంటి ప్రాంతీయ పార్టీల వార్షిక ఆడిట్, సహకార నివేదికలు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి, అయితే పార్టీల విరాళాల ప్రకటనలు 2019-20 ఆర్థిక సంవత్సరానికి వ్యత్యాసాలను చూపుతున్నాయి. "ఈ పార్టీలు నివేదికలో విశ్లేషించబడలేదు" అని ADR తెలిపింది.

click me!