పెళ్లి జంటలకు సజ్జనార్ గుడ్ న్యూస్.. అలా చేస్తే ఆర్టీసీ నుంచి కానుకలు..

By AN TeluguFirst Published Nov 12, 2021, 12:26 PM IST
Highlights

తెలంగాణ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన సజ్జనార్త నదైన మార్క్‌ను కనబరచడంలో ఎప్పుడూ ముందుంటారు. తాజాగా ఆయన తీసుకున్న ఓ నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. 

రాజేంద్రనగర్ : వివాహ శుభకార్యాలకు ఆర్టీసీ బస్సు బుక్ చేసుకున్న Wedding coupleకు కానుకలు ఇచ్చే కార్యక్రమానికి ఎండీ వీసీ సజ్జనార్ శ్రీకారం చుట్టారు. గురువారం యాదగిరిగుట్ట డిపో నుంచి రెండు బస్సులను అద్దెకు తీసుకుని కొంపల్లి వేదికగా పెళ్లి చేసుకున్న వరుడు ఆకుల భరత్ కుమార్, వధువు సౌమ్యలకు డ్రైవర్లు ముత్యాల ఆంజనేయులు, పబ్బాటి గణేష్ జ్ఞాపికను బహూకరించి ఆశీర్వదించారు. ఆర్టీసీ ఎండీ స్వయంగా హాజరై నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. 

డ్రైవర్లను అభినందించి ఫొటో దిగి ప్రోత్సహించారు. రాజేంద్రనగర్ బస్సు డిపోనుంచి గురువారం 15 బస్సులను వివాహ శుభకార్యాలకు rentకు ఇచ్చామని డిపో మేనేజర్ పి. చంద్రకాంత్ తెలిపారు. Bus book చేసుకున్న మల్లాపూర్ గ్రామానికి చెందిన వరుడు సాయి కుమార్, వధువు సుమాంజలికి డిపో తరఫున శుభాకాంక్షలు తెలుపుతూ డ్రైవర్ యాదవ్ చేతుల మీదుగా కానుక అందజేశామని చెప్పారు. ప్రజలు తక్కువ ధరకు, ఎలాంటి డిపాజిట్ లేకుండా RTC busలను బుక్ చేసుకోవచ్చని సూచించారు. 

ఇదిలా ఉండగా... తెలంగాణ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన సజ్జనార్.. తనదైన మార్క్‌ను కనబరుస్తున్నారు. ఆర్టీసీని గాడిలో పెట్టేందుకు, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంలో భాగంగా వినూత్న కార్యక్రమాలను చేపడుతున్నారు. ట్విట్టర్‌లో కూడా యాక్టివ్‌గా ఉంటూ ప్రయాణికుల నుంచి వస్తున్న అభ్యర్థనలపై స్పందిస్తున్నారు.  

దీంట్లో భాగంగానే అక్టోబర్ 25న హైదరాబాద్ నగరంలోని సిటీ బస్సులో సాధారణ ప్రయాణికుడిగా టికెట్ తీసుకుని ప్రయాణం చేశారు. ఈ సమయంలో బస్సుల్లో ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుడా MGBS పరిసరాలను పరిశీలించారు. అక్కడ ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. వినాయక నిమజ్జనానికి కూడా Sajjanar ఫ్యామిలీతో పాటు ఆర్టీసీ బస్సులో ప్రయాణించి సింప్లిసిటీ చాటుకున్నారు. 

ఇటీవల దసరా పండగ సందర్భంగా స్పెషల్ బస్సుల్లో అదనపు చార్జీలను రద్దు చేశారు. ప్రయాణికులు.. ప్రైవేటు వాహనాల్లో కాకుండా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేలా తనదైన నిర్ణయాలు తీసుకుంటారు. ఈ క్రమంలోనే తాజాగా సజ్జనార్ ప్రయాణికులకు మరో శుభవార్త చెప్పారు. ప్రజల నుంచి వచ్చిన విజ్జప్తి మేరకు టీఎస్‌ఆర్టీసీలో యూపీఐ/క్యూఆర్‌ కోడ్ ద్వారా పెమేంట్స్ చేసే సదుపాయాన్ని పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించామని చెప్పారు.

ఆర్టీసీ బస్సులు రావడం లేదు.. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు చిన్నారి లేఖ, స్పందించిన సజ్జనార్

అయితే ప్రస్తుతం ఇది Hyderabad నగరంలోని కొన్ని చోట్ల మాత్రమే అందుబాటులో ఉండనుంది. ఎంజీబీఎస్‌లోని టికెట్ రిజర్వేషన్ సెంటర్, పార్సిల్ అండ్ కార్గొ సెంటర్‌లో యూపీఐ/క్యూఆర్‌ కోడ్ ద్వారా చెల్లింపులు చేసేందుకు అవకాశం కల్పించారు. అదే విధంగా జూబ్లీ బస్ స్టేషన్‌లోని టికెట్ రిజన్వేషన్ కౌంటర్, బస్ పాస్ కౌంటర్‌, పార్సిల్ అండ్ కార్గొ సెంటర్‌లలో, రేతిఫైల్ బస్ స్టేషన్‌లో కూడా ఈ సేవలను ప్రారంభిస్తున్నామని సజ్జనార్ చెప్పారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. 

ప్రయాణికులు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తొలుత వీటిని పరిశీలించిన తర్వాత.. ఈ సేవలను తెలంగాణ అంతటా విస్తరించేందుకు ప్లాన్ చేస్తున్నామని సజ్జనార్ చెప్పారు. ప్రతి ఒక్కరు ఈ సేవలను ఉపయోగించుకుని.. గ్రాండ్ సక్సెస్ చేయాలని కోరారు. ఇందుకు సంబంధించి ఏమైన సలహాలు, సూచనలు ఉంటే కూడా చెప్పాలని కోరారు.  డిజిటలైజేషన్‌కు ప్రాధాన్యత ఏర్పడిన సమయంలో.. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సజ్జనార్ తీసుకున్న నిర్ణయంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

click me!