హైఎండ్ కార్లలో వచ్చి ఏటిఎం ఛోరీలు.. అసలు విషయం ఏంటంటే...

By AN TeluguFirst Published Nov 15, 2021, 11:21 AM IST
Highlights

నిందితులు గతంలో హైవేలపై పార్క్ చేసిన వాహనాల నుంచి టైర్లను దొంగిలించేవారు. తరువాత, వారి గ్రామస్థుల సహాయంతో, వారు ATM మెషీన్ల నుండి నగదును దొంగిలించే వివిధ పద్ధతులను నేర్చుకున్నారు. 

హైదరాబాద్ : నవంబర్ 6న మంచిర్యాలలోని ఏటీఎం మెషీన్‌లో నగదు దొంగిలించినందుకు గానూ  Haryanaకు చెందిన నలుగురు వ్యక్తులు అరెస్టైన విషయం తెలిసింది. అరెస్టైన నిందితులకు అత్యాధునిక కార్లు, స్పోర్ట్స్ బైక్‌లు ఉన్నట్లు గుర్తించారు. నిందితులను రెండు రోజుల కస్టడీ విచారణలోకి తీసుకున్న పోలీసులు విచారణలో ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. 

నిందితుల మొబైల్‌ ఫోన్‌లో ఉన్న విషయాన్ని పోలీసులు పరిశీలించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నిందితులు ఉపయోగించిన ఫోన్ల ధర కనీసం రూ.60,000 ఉంటుందని తెలిసి ముందుగా షాక్ అయ్యారు. అంతేకాదు  "ఈ నిందితుల ఫోన్‌లలో, వారు High-end cars, bikesలను ఉపయోగిస్తున్నట్లు మేం కనుగొన్నాం" అని మంచిర్యాల పోలీసు వర్గాలు  తెలిపాయి.

వీరి నేరచరిత్రను తవ్విన పోలీసులకు అనేక ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసాయి. నిందితులు రాబిన్ ఖాన్, సాహిబ్, హరీష్ లు నుహ్ జిల్లాకు చెందిన వారు కాగా, ఎజాజ్ అహ్మద్ ఖాన్ హర్యానాలోని పాల్వాల్ నివాసి. 
Accused గతంలో హైవేలపై పార్క్ చేసిన వాహనాల నుంచి టైర్లను దొంగిలించేవారు. తరువాత, వారి గ్రామస్థుల సహాయంతో, వారు ATM మెషీన్ల నుండి నగదును దొంగిలించే వివిధ పద్ధతులను నేర్చుకున్నారు. 

అలా ATM నగదు చెస్ట్‌ను గ్యాస్ కట్టర్‌తో కత్తిరించారు. “ఇప్పటి వరకు, మేం నిందితుల వద్ద నుండి 60 ATM కార్డులను స్వాధీనం చేసుకున్నాము.  తమ గ్రామంలో ఒక్కో కార్డుకు రూ.1000 కమీషన్‌తో చాలా మంది ఏటీఎం కార్డులు అద్దెకు ఇస్తున్నారని నిందితులు తెలిపారు. బ్యాంకు లావాదేవీలను పరిశీలించినప్పుడు ఒక్కో ఖాతాలో లక్షల రూపాయలు ఉన్నట్లు తెలిసింది' అని పోలీసులు తెలిపారు.

హైద్రాబాద్‌లో మరో సైబర్ మోసం: క్రిఫ్టో కరెన్సీ పేరుతో రూ. 33 లక్షల స్వాహా

మంచిర్యాలలో విదేశాల నుంచి కొనుగోలు చేసిన తాళం చెవితో ప్రభుత్వ రంగ బ్యాంకు ఏటీఎంను తెరిచిన నిందితులను అరెస్టు చేశారు. ATM మెషీన్‌ను ఆన్- ఆఫ్ చేసే బటన్‌ను యాక్సెస్ చేయడానికి ఈ కీ సహాయపడుతుంది. మెషీన్ లో ఏటీఎం కార్డు పెట్టిన తరువాత.. క్యాష్ విత్ డ్రా గురించి కార్డును పెట్టి.. క్యాష్ నొక్కినప్పుడు.. ATM machine క్యాష్ డిస్పెన్సర్ నోరు తెరుచుకుంటుంది. ఆ సమయంలో ATM మెషిన్ నగదును పంపిణీ చేసే ముందు.. ఒక శబ్దం చేస్తుంది. అది నగదు పంపిణీ చేసే శబ్దం. ఇ sound వినిపించే ముందు నిందితులు యంత్రాన్ని ఆఫ్ చేస్తారు.

ఆ తరువాత చేతివేళ్లను ఉపయోగించి, ఆ  నగదును బయటకు తీస్తారు. ఆ తరువాత, తమ బ్యాంకు ఖాతా నుండి కొంత మొత్తం కనిపించడం లేదని పేర్కొంటూ కాల్ సెంటర్‌లో ఫిర్యాదు చేస్తారు. తాము ఏటీఎంలో కార్డు పెట్టి, డబ్బులు తీశామని కానీ.. తమకు మనీ రాలేదని చెబుతారు. దీంతో వారికి విజయవంతంగా రీయింబర్స్‌మెంట్ దొరుకుతుంది’ అని పోలీసులు తెలిపారు. నిందితులపై సస్పెక్ట్ షీట్ తెరిచారు.

click me!