Ragging in Warangal: కాకతీయ మెడికల్ కాలేజ్‌లో ర్యాగింగ్ కలకలం..మోదీ, కేటీఆర్‌కు విద్యార్థి ట్వీట్

Published : Nov 15, 2021, 10:26 AM IST
Ragging in Warangal: కాకతీయ మెడికల్ కాలేజ్‌లో ర్యాగింగ్ కలకలం..మోదీ, కేటీఆర్‌కు విద్యార్థి ట్వీట్

సారాంశం

వరంగలోని కాకతీయ మెడికల్ కాలేజ్‌లో ( kakatiya medical college) మరోసారి ర్యాగింగ్ (Ragging) కలకలం రేపింది. సీనియర్ విద్యార్థులు.. జూనియర్లను ర్యాగింగ్ చేసస్తున్నారని ఓ విద్యార్థి ప్రధాని నరేంద్ర మోదీ (narendra modi), కేంద్ర హోం మత్రి అమిత్ షా (Amit shah), తెలంగాణ మంత్రి కేటీఆర్ (ktr), తదితరులను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. 

వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్‌లో ( kakatiya medical college) మరోసారి ర్యాగింగ్ (Ragging) కలకలం రేపింది. సీనియర్ విద్యార్థులు.. జూనియర్లను ర్యాగింగ్ చేసస్తున్నారని ఓ విద్యార్థి ప్రధాని నరేంద్ర మోదీ (narendra modi), కేంద్ర హోం మత్రి అమిత్ షా (Amit shah), తెలంగాణ మంత్రి కేటీఆర్ (ktr), తదితరులను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఫ్రెషర్స్ డే పేరుతో సీనియర్లు దారుణంగా వేధిస్తున్నారని ఆ విద్యార్థి పేర్కొన్నారు. వివరాలు.. కొత్త బ్యాచ్ విద్యార్థులకు ఆహ్వానం పలికేందుకు సెకండ్, థర్డ్ ఈయర్ విద్యార్థులు ప్రెషర్స్ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ పార్టీకి ఫోర్త్ ఈయర్ విద్యార్థులను కూడా ఆహ్వానించారు. జూనియర్ విద్యార్థులు సరైన గౌరవం ఇవ్వడం లేదంటూ కొందరు సీనియర్‌ విద్యార్థులు అనుచితంగా ప్రవర్తించినట్టుగా సమాచారం. ఈ క్రమంలోనే ఉన్నతాధికారులు చెప్పిన పట్టించుకోవడం లేదనే కారణంతోనే ట్వీట్ చేసినట్టుగా తెలుస్తోంది. 

కేఎంసీలో ర్యాగింగ్ తరహా చాలా ఘటనలు జరుగుతున్నాయి. దయచేసి కాపాడండి. వారంతా తప్ప తాగి జూనియర్ మెడికోల పట్ల అనుచితంగా వ్యవహరిస్తున్నారు. ఇదంతా వరంగల్ కేఎంసీలోని న్యూమెన్స్ హాస్టల్-1లో జరుగుతోంది. దయ చేసి కాపాడండి’ అని విద్యార్థి ట్విట్టర్‌లో మోదీ, కేటీఆర్, ఇతర ప్రముఖులను కోరారు. 

అయితే కేఏంసీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ మోహన్‌దాసు మాత్రం ఈ ఆరోపణలను కొట్టిపారేశారు. కాలేజీలో అలాంటి ఘటన ఏదీ చోటుచేసుకోలేదని, జూనియర్‌ విద్యార్థుల హాస్టల్‌కు సీనియర్ల హాస్టల్‌ భవనాలు చాలా దూరంగా ఉంటాయని తెలిపారు. మరోవైపు ఈ సంఘటన పైన మట్టేవాడ పోలీసులు న్యూమెన్స్ హాస్టల్లో ఏం జరుగుతోందనే దానిపై ఆరా తీస్తున్నారు.

గతంలో కూడా ర్యాగింగ్ కలకలం..
ఈ ఏడాది సెప్టెంబర్‌లో కూడా కాకతీయ మెడికల్ కాలేజ్‌లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని ఓ రాజకీయ కుటుంబానికి చెందిన విద్యార్థి జాతీయ కోటాలో సీటు సాధించి కాకతీయ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరంలో చేరాడు. ఎంబీబీఎస్‌ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్ధులు అతడిని ఓ గదిలోకి తీసుకెళ్లి బట్టలిప్పించి ర్యాగింగ్‌కు పాల్పడినట్లు తెలుస్తోంది. దీంతో బాధిత విద్యార్థి తన కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. దీంతో డీఎంఈ రమేశ్‌రెడ్డి కాకతీయ మెడికల్ కాలేజ్‌కు వచ్చి ర్యాగింగ్ ఘటనపై ఆరా తీసినట్లు సమాచారం. ర్యాగింగ్‌ చేసిన విద్యార్ధులు క్షమాపణ చెప్పారని, వివాదం అంతటితో సమసిపోయిందని కేఎంసీ ప్రిన్సిపాల్‌ మోహన్‌దాస్‌ తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు
హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?