Ganja Seized in Hyderabad : హైదరాబాద్‌లో 1,240 కిలోల గంజాయి పట్టివేత..సీలేరు నుంచి మహారాష్ట్రకు తరలిస్తుండగా

By team teluguFirst Published Nov 15, 2021, 11:05 AM IST
Highlights

గంజాయి అక్రమ రవాణా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను హైదరాబాద్ రాచకొండ పోలీసులు(Rachakonda Police) అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి భారీగా గంజాయి స్వాధీనం (Ganja Seized) చేసుకున్నారు.

హైదరాబాద్‌లో (Hyderabad) భారీగా గంజాయి పట్టుబడింది. గంజాయి అక్రమ రవాణా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను రాచకొండ పోలీసులు(Rachakonda Police) అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి భారీగా గంజాయి స్వాధీనం (Ganja Seized) చేసుకున్నారు. ఈ ముఠా గంజాయిని విశాఖపట్నం సీలేరు నుంచి ముంబైకి తరలిస్తున్నారు. ఇంటెలిజెన్స్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఈ అంతరాష్ట్ర ముఠాను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి పోలీసులు 1,240 కిలోల గంజాయిని, మూడు కార్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ రూ. 2.08 కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.  

హైదరాబాద్ పోలీసులు (Hyderabad Police) డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతున్నారు. నగరంలో గత కొద్దిరోజులుగా విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే పలుచోట్ల భారీగా డ్రగ్స్ పట్టుబడుతున్నాయి. ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న డ్రగ్స్‌తో పాటుగా, నగరంలో డ్రగ్స్ సరఫరా చేయాలని చూస్తున్న ముఠాల ఆటను కట్టిస్తున్నారు పోలీసులు.

ఇక, ఇటీవల మల్కాజిగిరి పరిధిలో ఉన్న కౌకుర్ దర్గా వద్ద భారీగా గంజాయి (ganja) పట్టుబడింది. కౌకుర్‌ దర్గా వద్ద రెండు ద్విచక్ర వాహనాల్లో తరలిస్తున్న 450 కిలోల గంజాయిని ఎక్సైజ్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విలువ రూ.కోటికిపైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. గంజాయిని తరలిస్తున్న నులుగురిని అదుపులోకి తీసుకున్నారు. బైకులను సీజ్‌ చేశారు. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేప్టారు.

click me!