సుహాసిని కోసం ఎన్నికల ప్రచారానికి ఏపీ మంత్రి సునీత

Published : Nov 27, 2018, 12:22 PM IST
సుహాసిని కోసం ఎన్నికల ప్రచారానికి ఏపీ మంత్రి సునీత

సారాంశం

నందమూరి సుహాసిని కోసం ఎన్నికల ప్రచారం చేయడానికి చాలా మంది ప్రముఖులు ముందుకు వస్తున్నారు. 

నందమూరి సుహాసిని కోసం ఎన్నికల ప్రచారం చేయడానికి చాలా మంది ప్రముఖులు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే ఆమె తన ప్రచారాన్ని సాగిస్తున్నారు. కాగా.. ఆమె కుటుంబం నుంచి బాబాయి బాలకృష్ణ, సోదరులు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు కూడా ఆమె తరపున ప్రచారం చేయడానికి రెడీ అయ్యారు. వీరు కాకుండా.. ఏపీ మంత్రి పరిటాల సునీత కూడా ఇప్పుడు రంగంలోకి దిగుతున్నారు.

ఈ నెల 27, 28 తేదీల్లో కూకట్‌పల్లి నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్‌ మంత్రి పరిటాల సునీత ఎన్నికల ప్రచారం చేయనున్నారు. మహాకూటమి (టీడీపీ) అభ్యర్థి నందమూరి సుహాసిని తరపున మంగళవారం కేపీహెచ్‌బీలోని ఆ పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమయ్యే రోడ్‌ షోలో మంత్రి పాల్గొననున్నారు. అందుకోసం నందమూరి, పరిటాల యువశక్తి ఏర్పాట్లు చేస్తోంది. కేపీహెచ్‌బీ, బాలాజీనగర్‌, మోతీనగర్‌, బాలానగర్‌, ఓల్డ్‌బోయిన్‌పల్లి ప్రాంతాల్లో ప్రచారం ఉంటుంది.
 

read more news..

ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్.. ఎన్నికల షెడ్యూల్ ఖరారు

నందమూరి సుహాసినికి చిక్కులు: ఓటమికి రంగంలోకి వైఎస్ జగన్

కూకట్ పల్లి లో నందమూరి సుహాసిని ప్రచారం (ఫొటోస్)

ఘర్షణ: సుహాసిని ప్రచారాన్ని అడ్డుకున్న టీఆర్ఎస్ కార్యకర్తలు

 

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
Hyderabad: ఇది పూర్త‌యితే హైద‌రాబాద్‌లో దేశంలో టాప్ సిటీ కావ‌డం ఖాయం.. ORR చుట్టూ మెగా ప్రాజెక్ట్‌