పోలీసు వాహనంపై టీఆర్ఎస్ జెండా.. ఫోటో వైరల్

By ramya neerukondaFirst Published Nov 27, 2018, 11:45 AM IST
Highlights

తెలంగాణలో ఎన్నికల హోరు జోరుగా సాగుతోంది. ఇలాంటి సమయంలో రాచకొండ పోలీసులు  వివాదంలో చిక్కుకున్నారు.


తెలంగాణలో ఎన్నికల హోరు జోరుగా సాగుతోంది. ఇలాంటి సమయంలో రాచకొండ పోలీసులు వివాదంలో చిక్కుకున్నారు. అధికార పార్టీకి పోలీసులు పూర్తిగా సహకరిస్తున్నారని, ప్రచారం కూడా చేస్తున్నారంటూ విమర్శలు మొదలయ్యాయి.

అసలు మ్యాటర్ లోకి వెళితే...రాచకొండ పోలీసు కమిషనరేట్ కి చెందిన ఓ వాహనానికి టీఆర్ఎస్ పార్టీ జెండాలు కట్టి ఉన్నాయి. అది మీడియా కంట పడటంతో.. ఫోటో వైరల్ గా మారింది. టీఆర్ఎస్ కి పోలీసులు ఈ విధంగా ప్రచారం చేస్తున్నారంటూ పలువురు మండిపడుతున్నారు.

కాగా.. ఈ ఘటనపై రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ వివరణ ఇచ్చారు. పోలీసు వాహనాలు పెట్రోలింగ్ కి వెళ్లిన సమయంలో కొందరు వ్యక్తులు వాహనానికి ఆ జెండాను కట్టారని ఆయన తెలిపారు. వెంటనే ఆ జెండాను తొలగించినట్లు కూడా ఆయన తెలిపారు. కాగా.. పోలీసు వాహనానికి జెండా కట్టింది ఎవరో, ఆ ఫోటోని సోషల్ మీడియాలో ఎవరు షేర్ చేశారో.. తదితర విషయాలపై దర్యాప్తు చేపడుతున్నట్లు ఆయన చెప్పారు.

నిందితులను పట్టుకొని.. పూర్తి వివరాలు తెలియజేస్తామని ఆయన వివరించారు. దయచేసి.. ఇలాంటి తప్పుడు ప్రచారాలను సోషల్ మీడియాలో షేర్ చేయడం ఆపాల్సిందిగా ఆయన ఈ సందర్భంగా ప్రజలను వేడుకున్నారు. 

click me!