అనురాధరెడ్డి హత్య కేసు : పదిహేనేళ్లుగా సహజీవనం.. రూ.7లక్షల కోసం కిరాతకంగా హత్య..

By SumaBala Bukka  |  First Published May 25, 2023, 8:51 AM IST

సహజీవనం చేస్తున్న మహిళను కిరాతకంగా హతమార్చి.. శరీరాన్ని ముక్కలుగా నరికాడో కిరాతకుడు. ఛాదర్ ఘాట్ తల కేసులో సంచలనవిషయాలు వెలుగులోకి వచ్చాయి. 


హైదరాబాద్ : ఈనెల 15న మలక్ పేటలో దొరికిన మహిళ తల కేసు చిక్కుముడి వీడిన సంగతి తెలిసిందే. మృతురాలు ఎర్రం అనురాధగా గుర్తించారు. ఈ కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. అనూరాధరెడ్డి ను హత్య చేసిన తరువాత నిందితుడు మృతదేహాన్ని ముక్కలుగా చేసి ఫ్రిజ్ లో దాచి పెట్టాడు. హత్య చేసిన మూడు రోజుల తరువాత.. తలను పడేయడంతో హత్య విషయం వెలుగు చూసింది. 

నిందితుడు చంద్రమౌళి 15యేళ్లుగా అనూరాధతో సహజీవనం చేస్తున్నాడు. ఆమె దగ్గర చంద్రమోహన్ రూ.7 లక్షలు తీసుకున్నాడు. అంతేకాదు.. అనూరాధకు చంద్రమౌళి ఇంట్లోనే ఓ గదిని అద్దెకు ఇచ్చాడు. డబ్బుల విషయంలో వీరిద్దరి మధ్య వాగ్వాదాలు జరుగుతుండేవి. ఈ క్రమంలోనే డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని.. మే 12వ తేదీన ఆమెను హత్య చేశాడు. ఆ తరువాత కటింగ్ మెషీన్ తో ఆమె మృతదేహాన్ని ముక్కలుగా నరికేశాడు. వాటిని ఫ్రిజ్ లో దాచి పెట్టాడు. 

Latest Videos

గంగిరెడ్డి బెయిల్ పై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు అసాధారణం - సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

వాటినుంచి వాసన రాకుండా కెమికల్స్ లాంటివి చల్లాడు. హత్య చేసిన మూడు రోజుల తరువాత అంటే మే 15వ తేదీన తలను ప్లాస్టిక్ కవర్ లో పెట్టుకుని.. ఓ ఆటోలో మూసీ నది ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ అఫ్జల్ నగర్ కమ్యూనిటీ హాలు సమీపంలోని డొంకల్లో పడేశాడు. పడేసిన రెండు రోజులకు అంటే మే 17వ తేదీన తలను గమనించిన బల్డియా ఉద్యోగి శేఖర్ నాయక్ పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో ఈ హత్య విషయం వెలుగులోకి వచ్చి కలకలం రేగింది. 

దాదాపు వారం రోజులపాటు అన్ని కోణాల్లో దర్యాప్తు చేసిన పోలీసులు ఆటో నెంబర్, సీసీ ఫుటేజీ ఆధారంగా కేసు ఛేదించారు. మొదట ఆటో డ్రైవర్ ను పట్టుకుని.. అతను చెప్పిన వివరాలతో నిందితుడిని పట్టుకున్నారు. అతని ఇంట్లోని ఫ్రిజ్ లో మహిళ మిగతా శరీర భాగాలను చూసి షాక్ అయ్యారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. శరీర భాగాలను పోస్టుమార్టం నిమిత్తం పంపించారు. ఈ రోజు మహిళ శరీర భాగాలను కుటుంబసభ్యులకు అప్పగించే అవకాశం ఉంది. 

ఆ ఎమ్మెల్యేలను ప్రజలు తిరస్కరిస్తారు.. తాండూరులో విజయం నాదే: ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి సంచలనం

కాగా, అనూరాధ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర్లోని టీఆర్టీ కాలనీ నివాసి. ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో హెడ్ నర్స్ గా పనిచేస్తోంది. భర్తకు దూరంగా ఒంటరిగా ఉంటోంది. పదిహేనేళ్ల క్రితం నిందితుడు బి. చంద్రమోహన్ (48) తన తండ్రిని అనూరాధ పనిచేస్తున్న ఆస్పత్రిలో చికిత్స చేయించాడు. అప్పుడు ఏర్పడిన పరిచయం.. ఆ తరువాత సహజీవనానికి దారి తీసింది. చంద్రమోహన్ అవివాహితుడు. 

చంద్రమోహన్ కు చైతన్య పురి కాలనీలో సొంతిళ్లు ఉంది. అక్కడే అనూరాధ ఓ పోర్షన్ అద్దెకు ఉంటూ అతనితో సహజీవనం చేస్తుంది. చంద్రమోహన్ తన తల్లితో కలిసి అదే ఇంట్లో పై పోర్షన్ లో ఉంటున్నాడు. 

click me!