అన్నెపర్తిలో ఈ ఏడాది మూడు ప్రమాదాలు: మరణించింది హరికృష్ణ ఒక్కడే

By narsimha lodeFirst Published Aug 31, 2018, 3:48 PM IST
Highlights

నల్గొండ జిల్లాలోని 65వ నెంబర్ జాతీయ రహదారిపై ప్రతి ఏటా రెండు వేలకు పైగా  ప్రమాదాలు చోటు చేసుకొంటున్నాయి. ఈ ప్రమాదాల్లో సుమారు 800 మందికి పైగా చనిపోతున్నారు


నల్గొండ: నల్గొండ జిల్లాలోని 65వ నెంబర్ జాతీయ రహదారిపై ప్రతి ఏటా రెండు వేలకు పైగా  ప్రమాదాలు చోటు చేసుకొంటున్నాయి. ఈ ప్రమాదాల్లో సుమారు 800 మందికి పైగా చనిపోతున్నారు. సుమారు రెండు వేల మందికి పైగా గాయాల బారినపడుతున్నారు. నల్గొండ జిల్లాలోని  రాష్ట్ర రహదారిగా ఉన్న నార్కట్‌పల్లి- అద్దంకి రహదారిపై కూడ ప్రతి ఏటా సుమారు మూడు ప్రమాదాలు చోటు చేసుకొంటున్నాయి. ఈ ఏడాది కూడ మూడు ప్రమాదాలు జరిగితే  హరికృష్ణ మాత్రమే ఈ ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు.

నల్గొండ జిల్లా గుండా వెళ్లే జాతీయ, రాష్ట్ర రహదారుల్లో  జరిగన రోడ్డు ప్రమాదాల్లో  పలువురు ప్రముఖులు మృత్యువాత పడ్డారు.  వందలాది మంది గాయపడ్డారు. 2009 నుండి  ఈ ఏడాది ఇప్పటివరకు  జరిగిన నార్కట్‌పల్లి మండలం అన్నెపర్తి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో  హరికృష్ణ ఒక్కడే మృతి చెందడం గమనార్హం.

అన్నెపర్తి స్టేజీ వద్ద  2009 లో  5 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఇందులో ముగ్గురు మృతి చెందారు.  ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. 2010లో 4 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకొన్నాయి.ఈ ప్రమాదంలో ఒక్కరు మృతి చెందారు. మరో 5 గాయపడ్డారు. 2011లో ఒక్క ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. 2012లో మూడు ప్రమాదాలు జరిగితే ఇద్దరు మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డారు. 2013లో కూడ మూడు ప్రమాదాలు జరిగాయి. ఒక్కరు మరణించారు. ఏడుగురు గాయపడ్డారు.

ఇక 2014లో కూడ మూడు ప్రమాదాలు జరిగాయి. ఇద్దరు చనిపోగా, మరో ఇద్దరు గాయపడ్డారు.2015లో కూడ మూడు ప్రమాదాలు జరిగితే ఇద్దరు మృత్యువాతపడ్డారు ముగ్గురు గాయపడ్డారు.2016లో ఒక్క ప్రమాదం జరిగితే ఒక్కరే గాయపడ్డారు.

 గత ఏడాది కూడ మూడు ప్రమాదాలు జరిగాయి.. అయితే ఒక్కరు మరణించగా ముగ్గురు గాయపడ్డారు.ఈ ఏడాది ఇప్పటివరకు మూడు ప్రమాదాలు జరిగితే ఒక్కరు చనిపోయారు... ఎనిమిది మంది గాయపడ్డారు.  ఈ చనిపోయింది కూడ హరికృష్ణ  కావడం గమనార్హం.అన్నెపర్తి స్టేజీ వద్ద 2009 నుండి ఇప్పటివరకు సుమారు 29 రోడ్డు ప్రమాదాలు జరిగితే 15 మంది మృతి చెందారు.39 మంది తీవ్రంగా గాయపడ్డారు.

ఇక నల్గొండ జిల్లా గుండా వెళ్లే 65 నెంబర్ జాతీయ రహదారిపై  ప్రతి ఏటా సుమారు రెండువేలకు పైగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకొంటున్నాయి.  2009 నుండి  పోలీసు రికార్డుల ప్రకారంగా ఉన్న డేటా ఆధారంగా  వివరాలు ఇలా ఉన్నాయి.

2009లో జాతీయ, రాష్ట్ర రహదారులపై 2256 ప్రమాదాలు జరిగాయి.846 మంది మరణించారు. 3388 మంది గాయపడ్డారు. ఇక 2010లో 2160 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకొన్నాయి.881 మంది చనిపోతే , 3234 మంది తీవ్రంగా గాయపడ్డారు. 2011 లో2222 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకొన్నాయి. ఇందులో 883 మంది మృత్యువాతపడ్డారు. మరో 3104 మంది తీవ్రంగా గాయపడ్డారు.2012లో 2122 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకొన్నాయి.902 మంది మృతి చెందగా, 2992 మంది గాయపడ్డారు.

2013లో 2144 రోడ్డు ప్రమాదాలు జరిగాయి.847 మంది మృతి చెందితే, 2905 మంది తీవ్రంగా గాయపడ్డారు. 2015లో 1070 రోడ్డు ప్రమాదాలు జరిగాయి, ఇందులో 320 మంది చనిపోతే 1227 మంది గాయపడ్డారు.2016లో 989 రోడ్డు ప్రమాదాలు జరిగితే 310 మంది చనిపోయారు, మరో 1075 మంది తీవ్రంగా గాయపడ్డారు.

2017లో 961 ప్రమాదాలు జరిగితే 393 మంది చనిపోయారు, 1186 మంది గాయపడ్డారు.ఈ ఏడాది ఇప్పటివరకు 554 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకొన్నాయి. ఇందులో 211 మంది చనిపోతే 653 మంది గాయపడ్డారు.

 

ఈ వార్తలు చదవండి

నిజమేనా: ఆ ఇద్దరి మృతి వార్తపై షాక్ తిన్న చంద్రబాబు

దిక్కు మొక్కు లేక హరికృష్ణ ప్రమాదంలోని క్షతగాత్రులు

హరికృష్ణ మృతి: రాత్రి ఒకటిన్నరకు నిద్ర లేపాలని అడిగారు

నందమూరి హరికృష్ణ కుటుంబాన్ని వెంటాడుతున్న రోడ్డు ప్రమాదాలు

 

click me!