హైదరాబాదులో గోడ దూకి పారిపోయిన సమీర్ ఢిల్లీలో పట్టుబడ్డాడు

By rajesh yFirst Published Aug 31, 2018, 2:42 PM IST
Highlights

ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాది సమీర్ ను ఎన్ఐఏ పోలీసులు ఢిల్లీలో అరెస్ట్ చేశారు. మక్కామసీదు బ్లాస్ట్ లో సమీర్ పాత్ర ఉందని అనుమానించిన సీసీఎస్ పోలీసులు, సిట్ బృందం సమీర్ ను అదుపులోకి తీసుకుంది. విచారణలో భాగంగా 2010లో మహంకాళి పీఎస్ కు తీసుకువస్తుండగా సమీర్ గోడదూకి పరారయ్యాడు. ఆ తర్వాత 2013 లో కోల్ కత్తాలో పోలీసులకు పట్టుబట్టాడు.ట్రైన్ లో సమీర్ హైదరాబాద్ కి తీసుకువస్తుండగా రన్నింగ్ ట్రైన్ లో నుంచి దూకి పరారయ్యాడు. 

ఢిల్లీ: ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాది సమీర్ ను ఎన్ఐఏ పోలీసులు ఢిల్లీలో అరెస్ట్ చేశారు. మక్కామసీదు బ్లాస్ట్ లో సమీర్ పాత్ర ఉందని అనుమానించిన సీసీఎస్ పోలీసులు, సిట్ బృందం సమీర్ ను అదుపులోకి తీసుకుంది. విచారణలో భాగంగా 2010లో మహంకాళి పీఎస్ కు తీసుకువస్తుండగా సమీర్ గోడదూకి పరారయ్యాడు. ఆ తర్వాత 2013 లో కోల్ కత్తాలో పోలీసులకు పట్టుబట్టాడు.ట్రైన్ లో సమీర్ హైదరాబాద్ కి తీసుకువస్తుండగా రన్నింగ్ ట్రైన్ లో నుంచి దూకి పరారయ్యాడు. 

అయితే తాజాగా ఢిల్లీలోని ఓ ఇంట్లో సమీర్ ఉంటున్నట్లు తెలుసుకున్న ఎన్ఐఏ అతనిని అదుపులోకి తీసుకుంది. మక్కా మసీదు బ్లాస్ట్, మహంకాళి పీఎస్ గోడ దూకి పారిపోవడం వంటి ఘటనల నేపథ్యంలో విచారించేందుకు సమీర్ ను హైదరాబాద్ కు తీసుకురానున్నారు. ట్రాన్సిట్ వారెంట్ ద్వారా హైదరాబాద్ కి పోలీసులు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఔరంగబాద్ కు చెందిన సమీర్ పలు ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. అలాగే ఉగ్రవాదులకు సమీర్ నిధులు సమకూర్చేవాడని పోలీసుల విచారణలో తేలింది.

click me!