
కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేడు తెలంగాణకు రానున్నారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన రెండో దశ ప్రజా సంగ్రామ యాత్ర నేడు ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈరోజు మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడలో భారీ బహిరంగ సభను నిర్వహించాలని బీజేపీ నాయకులు నిర్ణయించారు. ఈ బహిరంగ సభలో పాల్గొనేందుకు అమిత్ షా తెలంగాణకు రానున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో పలు ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి.
నేడు తెలంగాణకు అమిత్ షా : ట్విట్టర్ లో కేంద్ర హోంమంత్రిపై ఎమ్మెల్సీ కవిత ప్రశ్నల వర్షం..
ఈ భారీ బహిరంగ సభను బీజేపీ నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి అధిక సంఖ్యలో జనసమీకరణకు ప్లాన్ చేశారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు వెల్లడించారు. నేటి మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు తుక్కుగూడకు వెళ్లే రహదారులు అన్నీ బీజేపీ బహిరంగ సభ కారణంగా అధిక రద్దీ ఉండే అవకాశం ఉందని చెప్పారు. దీంతో ఎల్‌బీనగర్, హయత్‌నగర్, దిల్‌సుఖ్‌నగర్, మలక్‌పేట, చంద్రాయనగుట్ట నుంచి ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే వాహనాదారులు ప్రత్యామ్నాయ దారుల గుండా ప్రయాణించాలని సూచించారు. అంతే కాకుండా ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెం.14 నుంచి మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 11 గంటల వరకు భారీ వాహనాలకు అనుతించామని పోలీసులు తెలిపారు.
టీఆర్ఎస్ తాటాకు చప్పుళ్లకు భయపడం.. కేటీఆర్ లీగల్ నోటీసుపై మండిపడ్డ బండి సంజయ్
అమిత్ షా షెడ్యూల్ ఇదే..
నేటి మధ్యాహ్నం 2.30కి బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేరుకుంటారు. ముందుగా సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌ను సందర్శిస్తారు. సాయంత్రం 5 గంటలకు శంషాబాద్ నోవాటెల్‌కు హోటల్ కు చేరుకుంటారు. సాయంత్రం 6.30 గంటలకు తుక్కుగుడలో జరిగే భారీ బహిరంగ సభకు ఆయన హాజరవుతారు. అక్కడ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రాత్రి 8.25 గంటలకు ఢిల్లీకి బయల్దేరి వెళతారు.