స్వాతి లక్రా చేతికి అమీన్ పురా రేప్ కేసు: డీజీపీ అదేశాలు

By telugu teamFirst Published Aug 14, 2020, 4:23 PM IST
Highlights

సంగారెడ్డి జిల్లా అమీన్ పురా మారుతి అనాథాశ్రమంలో బాలికపై జరిగిన అత్యాచారం కేసు వుమెన్స్ సెక్యూరిటీ వింగ్ బాస్ స్వాతి లక్రా చేతికి వచ్చింది. కేసును పర్యవేక్షించాలని డీజీపీ మహేందర్ రెడ్డి స్వాతి లక్రాను ఆదేశించారు.

హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా అమీన్ పురా అనాథాశ్రమంలో 14 ఏళ్ల బాలికపై జరిగిన అత్యాచారం కేసును వుమెన్స్ సెక్యూరిటీ వింగ్ బాస్ స్వాతి లక్రా పర్యవేక్షించనున్నారు. ఈ మేరకు డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. కేసు విచారణను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆయన స్వాతి లక్రాను ఆదేశించారు. 

కేసు నమోదైనప్పటి నుంచి నిందితుల అరెస్టు వరకు గల వివరాలను స్వాతి లక్రా తెప్పించుకున్నారు. నిందితుల అరెస్టు, ట్రయల్స్, కేసు విచారణ వంటి విషయాలను ఆమె పర్యవేక్షించనున్నారు. ఈ కేసుకు సంబంధించి స్వాతి లక్రా ఓ ప్రత్యేక అధికారని నియమించారు. 

ఇదిలావుంటే, సంగారెడ్డి జిల్లాలోని అమీన్ పురా లోని మారుతి అనాథాశ్రమంలో మరో ఘటన కూడా జరిగినట్లు తెలుస్తోంది. మారుతి అనాథాశ్రమంలో 14 ఏళ్ల బాలిక వరుస అత్యాచారానికి గురై చికిత్స పొందుతూ బుధవారం మరణించిన విషయం తెలిసిందే. తన మాదిరిగానే మరో బాలిక కూడా లైంగిక వేధింపులకు గురైనట్లు కొన్ని రోజుల క్రితం తనతో చెప్పినట్లు మృతురాలి పిన్ని ప్రీతి చెప్పించారు. 

Also Read: అనాధాశ్రమ బాలికలపై అత్యాచారాలు... ఛైల్డ్ వెల్ఫేర్ సభ్యురాలితో నిందితుడికి సంబంధాలు

ఆ బాలిక కూడా అస్వస్థతకు గురి కావడంతో ఆమె తల్లిదండ్రులు వచ్చి నిలదీశారని, అనాథాశ్రమం నిర్వాహకురాలు విజయ బెదిరించడంతో వాళ్లు తమ కూతురిని తీసుకుని వెళ్లిపోయారని మృతురాలు చెప్పినట్లు ఆమె చెప్పారు. 

బాలిక మృతి కేసులో ప్రధాన నిందితుడు వేణుగోపాల్ రెడ్డి ఓ ప్రైవేట్ ఫార్మా కంపెనీలో సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాడు. అతను అనాథాశ్రమంలోని 14 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశాడు. అనాథాశ్రమం నిర్వాహకురాలు చెలుకూరు విజయ, ఆమె సోదరుడు సూరపనేని జయదీప్ అతనికి సహకరించారు. రెండో బాలికపై కూడా వేణుగోపాల్ రెడ్డి అత్యాచారం చేశాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Also Read: అమీన్‌పూర్ కేసు: కేర్ సెంటర్ రిజిస్ట్రేషన్ రద్దు.. పోలీసుల అదుపులో నిందితులు 

అత్యాచారానికి గురైన బాలిక మర్మాంగాలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడ ఇన్ ఫెక్షన్ ఏర్పడిందని, అది శరీరానికి పాకడంతో సెప్టిసియాతో మరణించిందని నీలోఫర్ వైద్యులు చెప్పారు. మరో వారం రోజుల్లో పూర్తి స్థాయి నివేదిక వచ్చిన తర్వాతనే అసలు కారణాలు తెలుస్తాయి. 

click me!