Hyderabad : హైదరాబాద్ లో మరోసారి ఎంఐఎం హవా ... ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం

Published : Apr 25, 2025, 10:00 AM ISTUpdated : Apr 25, 2025, 10:02 AM IST
Hyderabad : హైదరాబాద్ లో మరోసారి ఎంఐఎం హవా ... ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం

సారాంశం

హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పతంగి పార్టీ ఎంఐఎం విజయం సాధించింది. కాంగ్రెస్ తో కలిసి కాషాయ పార్టీ బిజెపిని ఓడించింది ఎంఐఎం. ఎవరికెన్ని ఓట్లు వచ్చాయంటే...  

Hyderabad MLC Election Results 2025 : హైదరబాదీ పార్టీ ఎంఐఎం మరోసారి సత్తాచాటింది. రాజధాని నగరంలో తమ బలాన్ని మరోసారి నిరూపించుకుంటూ ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకుంది. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమిన్ (AIMIM) అభ్యర్ధి మీర్జా రియాజ్ ఉల్ హసన్ గెలుపొందారు.   
 
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం, బిజెపి మాత్రమే పోటీలో నిలిచాయి. ఎంఐఎం నుండి రియాజ్ పోటీచేస్తే, బిజెపి గౌతమ్ రావును బరిలో నిలిపింది. అయితే కాంగ్రెస్ మద్దతుతో ఎంఐఎం సునాయాసంగా విజయాన్ని సాధించింది.  మొత్తం 112 ఓట్లకుగాను 88 ఓట్లు పోలయ్యాయి. ఇందులో ఎంఐఎంకు 63 ఓట్లు రాగా బిజెపికి కేవలం 25 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో 38 ఓట్ల మెజారిటీతో ఎంఐఎం అభ్యర్ధి రియాజ్ ఉల్ హసన్ విజేతగా నిలిచారు. 

ఈ ఎన్నికల్లో బిజెపికి గెలిచే బలం లేకున్నా బరిలోకి దిగింది... బిఆర్ఎస్, కాంగ్రెస్ క్రాస్ ఓటింగ్ పై ఆశలు పెట్టుకుంది. అయితే ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా బిఆర్ఎస్ తప్పుకోవడం... కాంగ్రెస్ ఎంఐఎంకు మద్దతు ప్రకటించడం బిజెపి ఆశలు గల్లంతయ్యాయి. ఎంఐఎంకు చెందిన 49, కాంగ్రెస్ కు చెందిన 14 ఓట్లు రియాజ్ ఉల్ హసన్ కే పడ్డాయి. దీంతో అతడు విజయం సాధించాడు. 

హైదరాబాద్ స్థానికసంస్ధల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 23న అంటే గత బుధవారం ముగిసింది. ఈ ఎన్నికలకు బిఆర్ఎస్ దూరంగా ఉండటంతో ఆ పార్టీ కార్పోరేటర్లు, ఎక్స్ అఫిషియో సభ్యులు ఓటుహక్కును వినియోగించుకోలేదు. మిగతా అధికార కాంగ్రెస్, బిజెపి, ఎంఐఎం కార్పోరేటర్లు, ఎక్స్ అఫిషియో సభ్యులు ఓటుహక్కును వినియోగించుకున్నారు.ఇలా 78 శాతానికి పైగా ఓటింగ్ నమోదయ్యింది. కాంగ్రెస్ మద్దతుతో ఎంఐఎం సునాయాసంగా గెలుపొందింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Constable Recruitment 2025 : 48954 పోలీస్ జాబ్స్.. తెలుగులోనే పరీక్ష, తెలుగు రాష్ట్రాల్లోనే ఎగ్జామ్ సెంటర్
Hyderabad: యువ‌త త‌ల రాత మార్చేలా.. హైద‌రాబాద్‌లో గూగుల్ తొలి స్టార్ట‌ప్స్ హ‌బ్, దీని ఉప‌యోగం ఏంటంటే