5 లక్షల ర్యాంకును 50 వేలుగా మార్చుకొని.. నిట్ వరంగల్ లో సీటు పొందేందుకు యువతి ప్రయత్నం.. కానీ చివరికి

Published : Aug 31, 2023, 09:54 AM IST
5 లక్షల ర్యాంకును 50 వేలుగా మార్చుకొని.. నిట్ వరంగల్ లో సీటు పొందేందుకు యువతి ప్రయత్నం.. కానీ చివరికి

సారాంశం

నకిలీ పత్రాలతో వరంగల్ నిట్ లో సీటు పొందాలని ప్రయత్నించిన ఓ విద్యార్థిని అధికారులకు అడ్డంగా దొరికిపోయింది. మహారాష్ట్రకు చెందిన ఆ విద్యార్థినికి 5 లక్షల ర్యాంకు రాగా.. దానిని 50 వేలుగా మార్చుకుంది. అలాగే అలామెంట్ లెటర్ కూడా నకిలీది తయారు చేయించుకుంది.

ఆ విద్యార్థినికి జేఈఈలో 5 లక్షల పైచిలుకు ర్యాంకు వచ్చింది. కానీ దానిని 50 వేలుగా మార్చుకుంది. వరంగల్ నిట్ లో సీటు అలాట్ మెట్ అయినట్టుగా తప్పుడు పత్రాలను కూడా సిద్ధం చేసుకుంది. అయితే సర్టిఫికెట్ వెరిఫికేషన్ లో ఆ ర్యాంక్ కార్డ్, అలాట్ మెంట్ లెటర్ నకిలీదని తేలింది. ఇంకేముంది నిట్ అధికారులకు ఆమె అడ్డంగా దొరికిపోయింది. 

బీజేపీలో చేరాలనుకున్న మాజీ మంత్రి కృష్ణాయాదవ్‌కు వింత అనుభవం.. అందుబాటులో లేకుండా పోయిన అగ్రనేతలు

మహారాష్ట్రకు చెందిన ఓ విద్యార్థిని నకిలీ పత్రాలు తయారు చేసి వరంగల్ నిట్ లోని బీటెక్ లో సీటు పొందేందుకు ప్రయత్నించి దొరికిపోయింది. ఆ యువతికి వాస్తవానికి 5 లక్షల ర్యాంకు వచ్చింది. కానీ దానిని 50 వేలుగా ఫోర్జరీ చేసింది. అలాగే సీటు అలాట్ మెంట్ కూడా నకిలీది తయారు చేయించింది. కానీ నిట్ అధికారులు సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేస్తున్న సమయంలో ఆ సీట్ అలాట్ మెంట్ లెటర్, అలాగే ర్యాంక్ కార్డు కూడా నకిలీది అని తేలింది. 

ఇల్లెందు నుంచి పోటీ చేస్తా.. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతా - మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య కూతురు అనురాధ

దీనిపై ఆ విద్యార్థిని అధికారులు ప్రశ్నించారు. దీంతో తాను పత్రాలను ఫోర్జరీ చేశానని ఒప్పుకుంది. ఈ విషయాన్ని నిట్ అధికారులు సీసాబ్‌కు తెలియజేశారు. దీంతో వారు కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కాగా.. రవూర్కేలాలో కూడా ఇలాంటి నకిలీ పత్రాలు తయారు చేసి ముగ్గురు స్టూడెంట్లు సీట్లు పొందడానికి ప్రయత్నం చేశారు. అయితే ఇలా నకిలీ పత్రాలు తయారు చేయడంలో ఓ పెద్ద ముఠానే పని చేస్తోందని అర్థమవుతోంది. జేఈఈలో లక్షల్లో ర్యాంకు వచ్చినా..  సీటు పొందాలని ఎదురు చూస్తున్న విద్యార్థులను ఈ ముఠా సంప్రదిస్తోందని తెలుస్తోంది. వారికి నకిలీ పత్రాలు తయారు చేసి ఇచ్చి, విద్యార్థుల నుంచి డబ్బులు తీసుకుంటోందని ఆరోపణలు ఉన్నాయి.

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ