
హైదరాబాద్: రేవంత్ రెడ్డితో పాటు ఆయన కుటుంబసభ్యులు, బంధువులు ఇళ్లలో సాగుతున్న సోదాలకు సంబంధించిన విషయమై అధికారులు అడిగే ప్రశ్నలకు రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని న్యాయవాది రామారావు డిమాండ్ చేశారు.రేవంత్‌రెడ్డితో తనకు వ్యక్తిగత వైరం లేదని రామారావు చెప్పారు. దీనికి వెనుక ఎలాంటి ఉద్దేశ్యం లేదన్నారు.
శుక్రవారం నాడు హైద్రాబాద్ సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.2009లో ఎన్నికల అఫిడవిట్‌లో రేవంత్ రెడ్డి సాయిమౌర్య ఏస్టేట్ అనే రియల్ ఏస్టేట్ సంస్థలో రేవంత్ రెడ్డి రూ.2లక్షల40వేల700 షేర్స్ కొనుగోలు చేసినట్టు చెప్పారు.
అయితే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ... ఎలాంటి పబ్లిక్ ఇష్యూకు వెళ్లకుండానే ఈ షేర్స్ రేవంత్ ఎలా కొనుగోలు చేశాడని తాను సోధించినట్టు రామారావు చెప్పారు. ఈ క్రమంలోనే రేవంత్ తో పాటు ఆయన బంధువులు, కుటుంబసభ్యులు ఏ రకంగా అక్రమాలకు పాల్పడ్డారనే విషయాన్ని గుర్తించి తాను సీబీఐ అధికారులకు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు.
రేవంత్ రెడ్డితో పాటు ఆయన కుటుంబసభ్యులు, బంధువులు చేసిన అక్రమాలపై రెండు నెలలపాటు విచారణ చేసినట్టు ఆయన తెలిపారు. సాయి మగధ, సాయి మౌర్య ఇన్‌ఫ్రా పేర్లతో రియల్ ఏస్టేట్ కంపెనీలు ఏర్పాటు చేసుకొన్నారని న్యాయవాది రామారావు తెలిపారు.
అయితే తాను సోధించిన దాని కంటే ఐటీ అధికారుల దాడుల్లో పెద్ద ఎత్తున ఆస్తులు కూడ బయటకు వచ్చాయని న్యాయవాది రామారావు చెప్పారు. 19 డొల్ల కంపెనీలను ఏర్పాటు చేసుకొని వందలాది కోట్లను రేవంత్ రెడ్డితో పాటు ఆయన కుటుంబసభ్యులు, బంధువులు కూడ 400 కోట్లను కొల్లగొట్టారని రామారావు ఆరోపించారు.
రియల్ఏస్టేట్ కంపెనీల పేరుతో రేవంత్ రెడ్డి అనేక భూకబ్జాలకు పాల్పడ్డాడడని చెప్పారు. ఉప్పల్‌లో భూదందా బయటకు వచ్చిందని రామారావు చెప్పారు. జూబ్లీహిల్స్ హౌసింగ్ సోసైటీలో కూడ రేవంత్ రెడ్డి అక్రమాలకు పాల్పడ్డాడని రామారావు చెప్పారు.
తనకు ఏ రాజకీయ పార్టీతో కూడ సంబంధం లేదని రామారావు స్పష్టం చేశారు. తాను ఓ మహిళకు చెందిన భూమిని రక్షించేందుకు ప్రయత్నించడంతో కొందరు తనపై కేసులు పెట్టారని కూడ రామారావు చెప్పారు
రేవంత్ కేసుతో తనపై ఉన్న కేసులకు సంబంధం లేదన్నారు. తాను ఏ తప్పు చేసినా అవే చట్టాలు కూడ తనకు వర్తిస్తాయని చెప్పారు. అక్రమాలకు పాల్పడిన రేవంత్ కు పార్టీలు మద్దతు తెలపడం సరైందికాదని రామారావు చెప్పారు.
సంబంధిత వార్తలు
రేవంత్ భార్యను బ్యాంకుకు తీసుకెళ్లి ఆరా తీస్తున్న ఐటీ అధికారులు
24 గంటలుగా సోదాలు.. రాత్రంతా రేవంత్‌పై ప్రశ్నల వర్షం
రేవంత్ రెడ్డి లావాదేవీల చిట్టా ఇదే: గుట్టు విప్పిన న్యాయవాది
రేవంత్‌రెడ్డి చుట్టూ ఉచ్చు: వేయికోట్ల దాకా అక్రమార్జన?
అప్పుడు నా కూతురి లగ్న పత్రిక రోజే...ఇప్పుడు మళ్లీ : రేవంత్ ఆవేదన
జైలు నుంచే నామినేషన్ వేస్తా.. రేవంత్ రెడ్డి
కొడంగల్ కార్యకర్తల వద్ద భావోద్వేగానికి గురైన రేవంత్
తాళాలు పగలకొట్టి మరీ రేవంత్ ఇంట్లోకి అధికారులు
రేవంత్ రెడ్డి ఇళ్లపై ఐటి దాడులు: వేలు కేసిఆర్ వైపే...