జనాన్ని నమ్మించి..మోసం చేసినందుకు.. 47 లక్షల నజరానా

By sivanagaprasad kodatiFirst Published Sep 28, 2018, 11:26 AM IST
Highlights

జనాన్ని నమ్మించి.. వారి వద్ద నుంచి భారీ మొత్తంలో డబ్బు గుంజిన ఫ్యూచర్ మేకర్ కుంభకోణంలో పోలీసులు మరో నిందితుడిని అరెస్ట్ చేశారు.

జనాన్ని నమ్మించి.. వారి వద్ద నుంచి భారీ మొత్తంలో డబ్బు గుంజిన ఫ్యూచర్ మేకర్ కుంభకోణంలో పోలీసులు మరో నిందితుడిని అరెస్ట్ చేశారు. నెల్లూరు జిల్లా నవాబుపేటకు చెందిన దూది వెంకటేశ్వర్లు..ఫ్యూచర్ మేకర్ లైఫ్ కేర్ (ఎఫ్ఎంఎల్‌సీ) సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నాడు.

వారి ఆదేశాల మేరకు హైదరాబాద్ ఎస్ఆర్ నగర్‌లో ఎఫ్ఎంఎల్‌సీ కార్యాలయాన్ని ప్రారంభించాడు. ఆకట్టుకునేలా పేపర్లలో ప్రకటనలు ఇవ్వడంతో పాటు హైదరాబాద్‌లోని స్టార్ హోటళ్లలో ఖరీదైన సమావేశాలు ఏర్పాటు చేసి జనాన్ని నమ్మించాడు.

వారి వద్ద నుంచి డబ్బు వసూలు చేసి ఎఫ్ఎంఎల్‌సీ యజమాన్యానికి చెల్లించేవాడు. అలా సుమారు 2000 మందిని చేర్చినందుకు గాను ప్లాటీనమ్ స్టార్ టైటిల్‌తో పాటు.. 33 లక్షలు అందుకున్నాడు. తాజాగా డైమండ్ స్టార్ టైటిల్‌తో పాటు 14 లక్షలను అందుకున్నాడు. అయితే ఎఫ్ఎంఎల్‌సీ మోసం వెలుగులోకి రావడంతో సైబరాబాద్ ఆర్థిక మోసాల విభాగం వెంకటేశ్వరరావుపై నిఘా పెట్టి అతన్ని అదుపులోకి తీసుకుంది.

click me!