సమత కేసు: నిందితులకు ఉరి శిక్ష విధింపు

By narsimha lodeFirst Published Jan 30, 2020, 1:22 PM IST
Highlights

సమత కేసులో నిందితులకు ఉరి శిక్ష విధిస్తూ ఆదిలాబాద్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీర్పును వెలువరించింది

సమత పై గ్యాంగ్ రేప్, హత్య కేసులో నిందితులకు ఆదిలాబాద్ పాస్ట్ ట్రాక్ కోర్టు విధిస్తూ గురువారం నాడు తీర్పు చెప్పింది. గురువారం నాడు ఆదిలాబాద్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీర్పును వెలువరించింది.  

గత ఏడాది నవంబర్ 24వ తేదీన కుమరం భీమ్ జిల్లా ఎల్లాపటార్ సమీపంలో ముగ్గురు దుండుగలు రోడ్డు పక్కన పొదల్లోకి తీసుకెళ్లి సమతపై అత్యాచారానికి పాల్పడ్డారు.ఈ విషయం బయటకు తెలియకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో నిందితులు ఆమెను దారుణంగా హత్య చేశారు.

హైద్రాబాద్‌లోని దిశ గ్యాంగ్‌రేప్‌, హత్య ఘటనకు  మూడు రోజుల ముందే ఈ ఘటన చోటు చేసుకొంది.నిందితులను అరెస్ట్ చేయాలని స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. 

దిశ కేసుతో పోలిస్తే సమత కేసును సరిగా పట్టించుకోవడం లేదని స్థానికులు, ప్రజా సంఘాలు ఆ సమయంలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. దీంతో బాధితురాలి పేరును సమతగా మార్చారు. ఈ కేసు విచారణను వేగవంతం చేశారు. గత ఏడాది నవంబర్ 24వ తేదీ ఉదయం సమత ఎల్లాపటార్ సమీపంలో  ఉదయం పది గంటలకు గ్యాంగ్‌రేప్‌కు గురయ్యారు. ఆ తర్వాత ముగ్గురు నిందితులు ఆమెను హత్య చేసి ఆమె వద్ద ఉన్న రెండు వందల రూపాయాలు సెల్‌ఫోన్‌ తీసుకొని పారిపోయారు.

అదే రోజు రాత్రి ఎనిమిది గంటల సమయంలో సమత భర్త గోపి తన భార్య కన్పించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు. ఎల్లాపటార్ సమీపంలో మహిళ గ్యాంగ్‌రేప్ కు గురై హత్య చేసిన విషయాన్ని పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని చూసిన  భర్త గోపి అది తన భార్యదేనని ధృవీకరించారు.

సమత హత్య జరిగిన మూడు రోజుల తర్వాత ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. సమత అత్యాచారం, హత్య కేసులో పోలీసులు ఎ1 షేక్ బాబు, ఏ2 షాబుద్దీన్, ఏ3 షేక్ ముగ్దుమ్ లను నిందితులుగా చేరుస్తూ పోలీసులు గత ఏడాది డిసెంబర్ 14వ తేదీన చార్జీషీట్ దాఖలు చేశారు.

140 పేజీలతో చార్జీషీట్ దాఖలు చేశారు  మృతురాలి చీరపై ఉన్న స్పెర్మ్ ఆధారంగా నిందతులను గుర్తించినట్టుగా పోలీసులు ఛార్జీషీట్‌లో పేర్కొన్నారు.. ఈ విషయమై శాస్త్రీయ ఆధారాలను  కూడ కోర్టుకు సమర్పించారు.

గత ఏడాది డిసెంబర్ 16న  ఈ కేసు విచారణకు పాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. కేసుకు ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని 20 రోజుల్లో కేసు విచారణను పోలీసులు పూర్తి చేశారు.  

గత ఏడాడి డిసెంబర్ 23వ తేదీ నుండి 31వ తేదీ వరకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు సాక్షులను విచారించింది. పోలీసులు ఈ కేసులో 44 మందిని సాక్షులుగా చేర్చారు. అయితే ఈ కేసులో కోర్టు 21 మంది సాక్షులను మాత్రమే విచారించింది. నిందతుల తరపున ఎవరూ కూడ వాదించకూడదని బార్ అసోసియేషన్ నిర్ణయం తీసుకొంది. 

ఈ సమయంలో పాస్ట్ ట్రాక్ కోర్టు ప్రత్యేకంగా రహీం అనే న్యాయవాదిని నిందితుల తరపున వాదించేందుకు నియమించింది. ఇరు వర్గాల వాదనలను విన్న కోర్టు తుది తీర్పును ఈ నెల 27వ తేదీన ఇవ్వనున్నట్టుగా ప్రకటించింది.

అయితే పాస్ట్ ట్రాక్ జడ్జికి అనారోగ్యం కారణంగా తీర్పును 27వ తేదీన కాకుండా గురువారం నాడు ఇవ్వనున్నట్టుగా  కోర్టు ప్రకటించింది. దీంతో ఇవాళ ఈ కేసుపై కోర్టు తీర్పును వెలువరించింది.

 


 
 

click me!