డింపుల్ హయాతీ కేసు : హైకోర్టును ఆశ్రయించిన నటి..

By SumaBala Bukka  |  First Published Jun 8, 2023, 9:49 AM IST

తనపై పెట్టిన కేసును కొట్టివేయాలంటూ నటి డింపుల్ హయతి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. 
 


హైదరాబాద్ : సినీనటి డింపుల్ హయాతి, ఐపీఎస్ రాహుల్ హెగ్డే కేసులో.. డింపుల్ హయాతీ హైకోర్టును ఆశ్రయించారు. ట్రాఫిక్ డీసీపీ అధికారిక వాహనాన్ని తన బీఎండబ్ల్యూ వాహనంతో ఢీకొట్టిందన్న వార్తలతో ఇటీవల వార్తల్లో నిలిచింది నటి డింపుల్ హయాతి. ఆ ఘటనలో తనపై ఉన్న కేసును కొట్టివేయాలని హైకోర్టును ఆశ్రయించారు.

జూబ్లీహిల్స్ పోలీసులు ఆమెపై దాడి లేదా క్రిమినల్ ఫోర్స్ ఆరోపణలపై కేసు నమోదు చేశారు. పబ్లిక్ సర్వెంట్‌ను అతని విధుల చేయకుండా అడ్డుపడడం, అక్రమ నిర్బంధంలో ఉంచడం, బహిరంగ ప్రదేశంలో ర్యాష్ డ్రైవింగ్ కేసులు పెట్టారు. 

Latest Videos

హైదరాబాద్ లో ఇంటిముందు క్షుద్రపూజలు.. 16 యేళ్ల బాలిక ఆత్మహత్య..

జూబ్లీహిల్స్‌ పోలీసులపై ఈ కేసులో కొంతమంది ప్రభావాలకు లోనయ్యారని, ఈ మేరకే డ్రైవర్‌ ఎం. చేతన్‌ కుమార్‌ ఫిర్యాదుతో డీసీపీ (ట్రాఫిక్‌ పోలీస్‌) పేరును.. గుర్తు తెలియని పేరుగా పేర్కొంటూ ఫిర్యాదు చేయడంతో తనపై కేసు నమోదు చేశారని హయాతి పిటిషన్‌లో పేర్కొన్నారు. డిఫాక్టో ఫిర్యాదుదారు పోలీసు అధికారిగా తన అధికారిక సామర్థ్యాన్ని దుర్వినియోగం చేశారని ఆమె పేర్కొన్నారు. 

ఫార్చ్యూనర్‌తో పోలిస్తే సైజులో చాలా చిన్నది, సున్నితంగా ఉండే బీఎండబ్ల్యూ కారు ఢీకొనడం వల్ల.. దానికంటే బలమైన, బరువైన పోలీసు వాహనం డ్యామేజ్ అయ్యే అవకాశం లేదని ఆమె పిటిషన్ లో పేర్కొన్నారు. డింపుల్ పిటిషన్‌లో విక్టర్ డేవిడ్ కో-పిటిషనర్ గా కూడా ఉన్నారు. పోలీసులు తమను తమ ముందు హాజరుకావాలని పిలుస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. పోలీస్ స్టేషన్‌కి పోలీసులు తనను, డింపుల్ ని పిలవడంలో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ పాటించడం లేదని ఫిర్యాదు చేశారు. 

కేసును విచారించిన కోర్టు, పిటిషనర్లను విచారణ కోసం పోలీసు స్టేషన్‌కు పిలిపించడంలో విధి విధానాలను అనుసరించాలని జూబ్లీహిల్స్ పోలీసులను ఆదేశించింది. పిటిషనర్లను పిలిచినప్పుడు పోలీసులు సెక్షన్ 41-A CrPC  కింద నోటీసులు పిటిషనర్లకు జారీ చేస్తారు. తమ ఎదుట హాజరుకావాలని ఇప్పటికే డింపుల్‌కు 41-ఎ నోటీసులు జారీ చేసినట్లు పోలీసులు కోర్టుకు తెలియజేశారు.

ఇదిలా ఉండగా, నటి డింపుల్ హయాతి, ఆమె స్నేహితుడు డేవిడ్‌పై కేసు దర్యాప్తు చేస్తున్న జూబ్లీహిల్స్ పోలీసులు డీసీపీ ట్రాఫిక్-ఐ రాహుల్ హెగ్డే, అతని గన్‌మెన్, అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్‌లను సాక్షులుగా చేర్చి వారి వాంగ్మూలాలను నమోదు చేశారు. ఈ కేసులో ఫిర్యాదుదారుగా ఉన్న హెగ్డే డ్రైవర్ ఎం. చేతన్ కుమార్ వాంగ్మూలాన్ని కూడా పోలీసులు నమోదు చేసుకున్నారు.

ఈ కేసుపై న్యాయపరంగా పోరాడతామని హయాతీ తరపు న్యాయవాది పాల్ సత్యనాధన్ డేవిడ్ తెలిపారు. పార్కింగ్ సమస్యపై ఆమె ముఖాముఖిగా ఎదుర్కొన్న తర్వాత, ఆమె ప్రతిష్టను దెబ్బతీయడం, ఆమెను కటకటాల వెనక్కి నెట్టాలనే లక్ష్యంతో అధికారి నటిపై పగ పెంచుకున్నారని అతను పేర్కొన్నాడు.

"ఇది పోలీసుల అత్యుత్సాహం తప్ప మరొకటి కాదు. వారి దౌర్జన్యాలను ఎవరూ ప్రశ్నించకపోతే, అంతం ఉండదు. నా క్లయింట్ ప్రశ్నించినందున, ఆమె ఈ సమస్యలన్నింటినీ ఎదుర్కొంటోంది" అని న్యాయవాది డేవిడ్ అన్నారు.

తగిన ఆధారాలు సేకరించిన తర్వాతే ఎఫ్‌ఐఆర్‌ జారీ చేసినట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు. త్వరలోనే విచారణ పూర్తి చేసి ఛార్జిషీట్ దాఖలు చేస్తాం’ అని వారు తెలిపారు.

హెగ్డే అధికారిక వాహనాన్ని ఉద్దేశ్యపూర్వకంగా ఆమె కారుతో ఢీకొట్టడంతోపాటు అధికారి, నటి నివాసం ఉండే అపార్ట్‌మెంట్ పార్కింగ్ స్థలంలో ఉంచిన ట్రాఫిక్ కోన్‌లను తన్నడంపై జూబ్లీహిల్స్ పోలీసులు హయాతి, డేవిడ్‌లపై కేసు నమోదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

click me!