actor sagar : మొగలి రేకులు ఫేమ్ సాగర్ రామగుండం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన ఆదివారం జనసేన పార్టీలో చేరారు. పవన్ కల్యాన్ ఆయనకు రామగుండం టిక్కెట్ ఇవ్వాలని భావిస్తున్నట్టు సమాచారం.
janasena : మొగలిరేకులు (mogali rekulu) సీరియర్ లో హీరో పాత్ర పోషించిన ఆర్కే నాయుడు అందరికీ సుపరిచితమే. ఈ సీరియల్ లో ఆయన పాత్రకు ప్రత్యేక అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా మహిళల్లో ఆయనంటే యమా క్రేజ్. కొన్నేళ్ల కిందట ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ‘మిర్చి’ సినిమాలో కనిపించి సిల్వర్ స్క్రీన్ పై కూడా మెప్పించారు. ఇప్పుడు ఆయన గురించి ఎందుకు ఇంతలా చెప్పుకోవాల్సి వస్తుందంటే.. దానికి ఓ కారణం ఉంది.
మొగలి రేకులు సీరియల్ హీరోగా నటించి, అందరినీ మెప్పించిన ఆర్కే నాయుడు అసలు పేరు సాగర్ (actor sagar). ఆయన రామగుండం ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఆయన ఆదివారం జనసేన పార్టీలో చేరారు. సాగర్ ను జనసేన అధినేత పవన్ కల్యాన్ పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతో పాటు మరి కొందరు ప్రముఖులు కూడా పార్టీ కండువా కప్పుకున్నారు.
భూగర్భ గ్యాస్ పైప్ లైన్ లీక్.. మంటలు చేలరేగడంతో ఆందోళనకు గురైన స్థానికులు,.. కొంపల్లిలో ఘటన (వీడియో)
సాగర్ రామగుండం ప్రాంతానికి చెందిన వ్యక్తి కావడంతో ఆయనను ఇక్కడి నుంచి అసెంబ్లీ బరిలోకి దించాలని పవన్ కల్యాణ్ యోచిస్తున్నారని తెలిసింది. ఇక్కడి ప్రజల్లో సాగర్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. దీంతో ఇక్కడి నుంచే ఆయనను శాసనసభకు పంపించాలని జనసేన అధినేత భావిస్తున్నారని తెలుస్తోంది.
మహిళా ఆఫీసర్ హత్య కేసులో డ్రైవర్ అరెస్టు.. ఉద్యోగంలో నుంచి తొలగించందుకే దారుణం ?
తెలంగాణలో జనసేన బీజేపీతో కలిసి పోటీ చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. అయితే ఇప్పటికే బీజేపీ రామగుండం ఎమ్మెల్యే టిక్కెట్ బీజేపీ టిక్కెట్ కందుల సంధ్యారాణికి కేటాయించింది. పొత్తు కుదిరితే సాగర్ బరిలో నిలిచే అవకాశం లేదు. ఒక వేళ జనసేన ఒంటరిగానే బరిలోకి దిగాలని భావిస్తే కచ్చితంగా సాగర్ కు టిక్కెట్ కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి.