KTR: దొరల తెలంగాణ కావాలా..? ప్రజల తెలంగాణ కావాలా..? అని రాహుల్ గాంధీ అంటున్నారనీ, ఆయన సవాల్‌ను తెలంగాణ సమాజం స్వీకరిస్తుందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇది ఢిల్లీ దొరలకు, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల మధ్య జరిగే ఎన్నిక అని పేర్కొన్నారు.
KTR: దొరల తెలంగాణ కావాలా? ప్రజల తెలంగాణ కావాలా? అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ఆరు దశాబ్దాల కాలంలో కాంగ్రెస్ వందల మంది ప్రాణాలను తీసిందనీ, నేడు ఎన్నికల సమయంలో వచ్చి తియ్యటి మాటలు మాట్లాడుతూ తెలంగాణ ప్రజలను ఆగం చేస్తున్నారని మండిపడ్డారు. నేడు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
ఈ ఎన్నికలు ఢిల్లీ దొరలకు, తెలంగాణ ప్రజలకు మధ్య జరుగుతున్న ఎన్నికలని అన్నారు. పోటీ ఎప్పుడు రెండు ఆలోచన విధానాలు, సిద్ధాంతాలు, సంస్థల మధ్య జరుగుతది అని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు ఎవరూ పక్షన నిలుస్తారో డిసెంబర్ 3 న తెలుస్తోందని అన్నారు. కాంగ్రెస్ మాజీ అధినేత రాహుల్ గాందీ ఛాలెంజ్ కి తాము సిద్దమని అన్నారు.
తెలంగాణ అస్థిత్వం కోసం ఎన్నో పోరాటాలు చవిచూసిందనీ, ఆనాడు రాహుల్ ముత్తాత నెహ్రూను ఒప్పించి, మెప్పించి, ఆగం చేసి తెలంగాణలో ఆంధ్రాలో కలిపే కుట్ర జరిగిందని అన్నారు. ఆ కుట్ర తెలుసుకున్న విద్యార్థులు,యువకులు తిరబడ్డారనీ, ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ ఉద్యమం ప్రారంభించారని తెలిపారు. ఆ ఉద్యమ సమయంలో ఢిల్లీ దొర నెహ్రూ ఐదుగురి పిల్లల్ని పిట్టల్లా కాల్చిచంపించారని కేటీఆర్ గుర్తు చేశారు.
అలాగే.. ఆంధ్రప్రదేశ్ అవతరణ గురించి మాట్లాడుతూ.. ఆ రోజు తెలంగాణ, ఆంధ్రాను కలపొద్దని ఫజల్ అలీ సూచించినప్పటికీ కాంగ్రెస్ పెద్దలు వినకుండా బలవంతంగా కలిపారని మండిపడ్డారు. ఆనాడు ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవం గురించి ఖలీల్‌వాడీ మైదానంలో నెహ్రూ మాట్లాడుతూ.. బలవంతపు పెళ్లి చేస్తున్నామనీ, అమాయకపు ఆడపిల్ల పెళ్లి అతి హుషారు పిల్లాడితో పెళ్లి చేస్తున్నామని, సంసారం సాగితే మంచిదే.. లేదంటే విడాకులు తీసుకోవచ్చునని నెహ్రూ పేర్కొన్నారని గుర్తించారు.
ఆయన ఊహించిన విధంగానే 12 ఏండ్ల సంసారంలో తెలంగాణ దగపడిందనీ, 1968లో తెలంగాణ తిరగబడ్డదనీ, అన్యాయం జరుగుతుందని పోరాటం చేసిందని అన్నారు. ఆ పోరాటంలో పాల్గొన్న 370 మంది పిల్లల్ని ముదనష్టపు కాంగ్రెస్ పిట్టల్ల కాల్చిచంపిందని మండిపడ్డారు. తెలంగాణ ప్రజా సమితి నాయకత్వంలో మర్రి చెన్నారెడ్డి 11 మంది ఎంపీలను గెలిపించారనీ, మా తెలంగాణ మాకు కావాలని పోరాటం చేస్తే.. ఆ నాటి ప్రధాని ఇందిరమ్మ ఆ 11 మంది ఎంపీలను గుంజుకెళ్లి కాంగ్రెస్ లో కలుపుకుందనీ, తెలంగాణ ఆకాంక్షలను అణగదొక్కిందని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు.
ఆ తర్వాత 2001 లో గులాబీ జెండా ఎగిరిందనీ, కలిసోచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకులాగా కేసీఆర్ 2001 నుండి 2014 వరకు అన్నం తిన్నాడో, అటుకులు బుక్కరో తెలియదు గాని తెలంగాణ సాధన కోసం పోరాటం చేశారని తెలిపారు. ఆనాడు కాంగ్రెస్ తో నమ్మి పొత్తు పెట్టుకున్నామనీ, అలా నమ్మితే.. బలిదేవత సోనియా అమ్మ వందలాది మంది ప్రాణలను తీసుకుందని.. ఈ మాట ఆనాడు రేవంత్ రెడ్డే అన్నారని తెలిపారు. తెలంగాణ ఉత్తగనే రాలేదు. ఎంతో మంది ప్రాణాలు పోతే. కేసీఆర్ నిరాహార దీక్షతో తెలంగాణ అట్టుడికితే ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారని కేటీఆర్ గుర్తు చేశారు.
వాడు వీడు తెలంగాణ మేము ఇచ్చినాము అని అంటున్నారనీ, రేవంత్ రెడ్డి గాడు, హౌల గాడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఈ ఎన్నికలు బీఆర్ఎస్ కోసం కాదనీ, తెలంగాణ ఆగం కావద్దని అన్నారు. ఇక్కడ పోరాటం నిలబడ్డ వ్యక్తి తో కాదనీ, కాంగ్రెస్ తో మాత్రమే పోటీ అని అన్నారు. సింహం సింగిల్ గానే వస్తుందనీ, పందులే గుంపు గుంపులుగా వస్తాయని అన్నారు. గిట్ల అన్నందుకు ఏమైనా కేసు పెడితే బోయిన పల్లి వినోద్ కుమార్ పై పెట్టండనీ, డికే శివ కుమార్ మన నెత్తి మీద పాలు పోసి పోయాడనీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ అంటే నమ్మకమనీ, ఆయనో భరోసా అని, ప్రతిపక్షాల సెంటి మెంట్స్, అయింట్ మెంట్ లకు లోంగవద్దని మంత్రి కేటీఆర్ సూచించారు.