బండి సంజయ్ వ్యక్తి కాదు శక్తి అని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం కరీంనగర్ బీజేపీ ఆధ్వర్యంలో బండి సంజయ్ నిర్వహించారు. ఈ రోడ్ షోకు రాజాసింగ్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పై గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ వ్యక్తి కాదనీ.. ఆయనో శక్తి అని అన్నారు. ఆయనతో దున్నపోతులు పోటీ పడలేవని రాజాసింగ్ అన్నారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ నేడు ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం రోడ్ షో నిర్వహించగా ముఖ్య అధితిగా రాజా సింగ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాజాసింగ్ మాట్లాడుతూ... ఎంఐఎం అధినేత ఒవైసీకి దమ్ముంటే.. కరీంనగర్ లో ఎమ్ఎమ్ అభ్యర్థిని ఎన్నికల బరిలో నిలుపాలని సవాల్ చేశారు. కరీంనగర్‌లో సంజయ్ నామినేషన్‌కు రావడం తనకు చాలా ఆనందంగా ఉందని, ఆయనను ఇప్పటికే పార్లమెంటుకు పంపించిన ప్రజలు.. ఇప్పుడు ఆయన అసెంబ్లీకి పంపించాలని పిలుపునిచ్చారు. బండి సంజయ్ ను తనతో పాటు అసెంబ్లీకి తీసుకెళ్లేందుకే కరీంనగర్ కు వచ్చానని కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ను గద్దె దించాలని కంకణం కట్టుకొని ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టామని, తమ పార్టీని బలోపేతం చేయాలని అన్నారు.
ఈ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ డబ్బును ఎగజల్లుతుందని, ఈ సమరం డబ్బుకు? ధర్మానికి మధ్య సాగుతోందని, ఈ విషయాన్ని తెలుసుకుని ఓటు వేయాలని కోరారు. ధర్మం కోసం, నిరంతరం ప్రజల వైపు నిలిచే బీజేపీ వైపు నిలుస్తారా? లేక అవినీతి, అక్రమాలతో వేల కోట్లు సంపాదించిన బీఆర్ఎస్ కు ఓటు చేశారా? అనేది ప్రజలే తేల్చుకోవాలన్నారు. బండి సంజయ్ వ్యక్తి కాదని, ఓ శక్తి అని కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ సెక్యులర్ పార్టీ అని, మైనార్టీల గురించి కూడా ఆలోచన చేస్తోందనీ, మైనార్టీ అక్కాచెల్లెళ్ల పరువును కాపాడటానికే ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేసేమని అన్నారు.
మరోవైపు బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. బండి సంజయ్ పోరాటాన్ని మంత్రి గంగుల కమలాకర్ చూశాడని, ఆయన ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నాడని తెలియగానే మంత్రి... దారుస్సలాంలోని మజ్లిస్ పార్టీ కార్యాలయానికి పరుగెత్తారని ఎద్దేవా చేశారు. కరీంనగర్ లో గంగుల కమలాకర్ ఓటమి ఖాయమని, ఆయన ఇప్పటికైనా పోటీ నుంచి తప్పుకుంటే మంచిదని అన్నారు. సంజయ్ గెలుపును ఎవరూ అడ్డుకోలేరని, ఇక గంగుల అవినీతికి అంతులేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడి, బడి, గ్రానైట్ సహా అన్నింటా అవినీతికి పాల్పడ్డరని మండిపడుతున్నారు.