బస్సు కింద పడి రెండేళ్ల చిన్నారి (2 years old girl dead) మరణించింది. ఈ ఘటన హైదరాబాద్ (hyderabad)లోని హబ్సిగూడ (habsiguda)లో జరిగింది. తన అన్నను స్కూల్ బస్సు ఎక్కించేందుకు వచ్చి ఆ చిన్నారి ప్రమాదానికి గురైంది.
అన్నను స్కూల్ కు పంపించేందుకు బస్ పికప్ పాయింట్ దగ్గరకు వచ్చిన ఆ రెండేళ్ల చిన్నారి తిరిగి రాని అనంతలోకాలకు వెళ్లిపోయింది. ప్రమాదవశాత్తు ఆ బస్సు కింద పడి మరణించింది. ఈ ఘటన హైదరాబాద్ లోని హబ్సిగూడలో చోటు చేసుకుంది. పోలీసులు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు.
లక్షద్వీప్ లో ప్రధాని మోడీ సాహసాలు.. స్నార్కెలింగ్ చేసి, అందమైన పగడాలు చూసి.. ఫొటోలు రిలీజ్..
వివరాలు ఇలా ఉన్నాయి. హబ్సిగూడలోని రవీంద్రనగర్ లో రెండేళ్ల చిన్నారి తన తండ్రి, నాన్నమ్మతో అన్నను స్కూల్ బస్సు ఎక్కించడానికి పికప్ పాయింట్ వద్దకు వచ్చింది. అయితే ఆ సమయంలో డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనం నడపడం వల్ల చిన్నారిని గమనించక ఢీకొట్టాడు. దీంతో పాప తల, శరీరంపై ఇతర భాగాలకు గాయాలు అయ్యాయి.
కాళేశ్వరంపై సీబీఐ విచారణకు సీఎం ఎందుకు లేఖ రాయడం లేదు - కిషన్ రెడ్డి
ఈ ప్రమాదం వల్ల బాలికకు తీవ్ర రక్త స్రావం జరిగింది. దీంతో చిన్నారి అక్కడికక్కడే మరణించింది. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు కేసు నమోదు చేశారు. డ్రైవర్ ను అరెస్టు చేశారు. అంత వరకు కళ్ల ముందే ఆడుకున్న చిన్నారి మరణించడంతో ఆ కుటుంబ సభ్యులు తీవ్రంగా రోదించారు.