గుడ్‌న్యూస్: తెలంగాణలో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్

By narsimha lode  |  First Published Jan 4, 2024, 4:40 PM IST


తెలంగాణలో  పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్ మెంట్ కు అడ్డంకులు తొలగిపోయాయి.


హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుళ్ల నియామాకాలకు మార్గం సుగమమైంది. కానిస్టేబుళ్ల నియామాకాలకు సంబంధించి గతంలో తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును  డివిజన్ బెంచ్ కొట్టివేసింది. దరిమిలా తెలంగాణలో 15,640 పోలీస్ కానిస్టేబుళ్ల నియామాకాలకు  మార్గం సుగమమైంది. 

కానిస్టేబుల్ నియామాకాలకు సంబంధించి నిర్వహించిన పరీక్షలో  నాలుగుప్రశ్నలకు మార్కులు కలపాలని సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆర్డర్ పై డివిజన్ బెంచ్ స్టే ఇచ్చింది.ఉస్మానియా యూనివర్శిటీ ఆధ్వర్యంలో స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేయాలని హైకోర్టు సూచించింది.  కొత్త కమిటీ ముందు నాలుగు ప్రశ్నలు ఉంచాలని హైకోర్టు ఆదేశించింది.నాలుగు వారాల్లో  కానిస్టేబుల్ నియామకాలు పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Latest Videos

కానిస్టేబుల్ రిక్రూట్ మెంట్ కు సంబంధించి  నిర్వహించిన రాత పరీక్షలో   122, 130, 144 ప్రశ్నలకు తెలుగులోకి అనువదించలేదు. 57వ ప్రశ్నతప్పుగా ఉన్నందున ప్రశ్నాపత్రం నుండి తొలగించాలని  తెలంగాణ హైకోర్టు 2023 అక్టోబర్  10న ఆదేశాలు జారీ చేసింది. 

తెలంగాణ కానిస్టేబుల్ రిక్రూట్ మెంట్ కు సంబంధించి నిర్వహించిన పరీక్షలకు సంబంధించి ప్రశ్నపత్రంలో 23 అభ్యంతరాలు తెలిపారు.ఈ విషయమై  2022 ఆగస్టు  30న  హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. 

తెలంగాణలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల నియామకాలకు సంబంధించి  తెలంగాణ పోలీస్ నియామక మండలి పరీక్షలు నిర్వహించింది.  రాష్ట్రంలోని  16,604 కానిస్టేబుళ్ల పోస్టులను భర్తీ చేసేందుకు  పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు పరీక్షలను నిర్వహించింది.  2022 లో 16,604 పోలీస్ కానిస్టేబుల్స్, 587 సబ్ ఇన్స్ పెక్టర్స్ పోస్టుల భర్తీకి సంబంధించి పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు  నోటిఫికేషన్ విడుదల చేసింది.  
 

 

 

click me!