
నిజామాబాద్ జిల్లాలో బీజేపీకి ఊహించని పరిణామం ఎదురైంది. ఆ పార్టీ స్టేట్ ఎక్సిక్యూటివ్ మెంబర్, ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. బీజేపీ ప్రాథమిక సభ్యత్వాన్ని వదులుకుంటున్నట్టు ఆయన బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి రాసిన తన రాజీనామా లేఖలో వెల్లడించారు.
అమ్మఒడి సొమ్ము రావడం లేదని వెళ్తే.. వేలిముద్ర వేసుకొని డబ్బులు కాజేసిన వాలంటీర్..
కొంత కాలం నుంచి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కు, వినయ్ కుమార్ కు మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. ఇటీవల స్టేట్ బీజేపీ ఆఫీసులో అరవింద్ కు వ్యతిరేకంగా వినయ్ ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ఏకంగా పార్టీనే విడిచిపెట్టారు. ఇంత కాలం పాటు పార్టీకి నమ్మకంగా ఉండి.. సరిగ్గా ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో వినయ్ కుమార్ బీజేపీని విడిచిపెట్టడం జిల్లాలోనే కాదు.. రాష్ట్రంలోనే చర్చకు తావిచ్చింది.
ఒంటరిగా ఉంటున్న దళిత వివాహితపై గ్యాంగ్ రేప్.. వైసీపీ నాయకుల దారుణం ?
ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆర్మూర్ నుంచి బీజేపీ తరఫున పోటీ చేశాడు. కానీ ఆ ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. ఆ సమయంలో వినయ్ దాదాపు 20 ఓట్లను సొంతం చేసుకున్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ తనకే అవకాశం కల్పిస్తుందని ధీమాతో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఆకస్మికంగా పార్టీని విడిచివెళ్లారు.
కూరగాయలు కొనుగోలు చేస్తుండగా తెగిపడ్డ విద్యుత్ తీగ.. వృద్ధురాలి దుర్మరణం..కర్నూలు జిల్లాలో ఘటన
కాగా.. వినయ్ కుమార్ తరువాత ఎటువైపు అడుగులేస్తారని జిల్లా రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. అయితే ఆయన కాంగ్రెస్ పార్టీలోనే చేరుతారని ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. వినయ్ కుమార్ కాంగ్రెస్ లో చేరితే జిల్లా బీజేపీ పై ప్రభావం పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.