Minor Girl Rape case: హైద‌రాబాద్‌లో దారుణం.. బాలికపై అత్యాచారం ఆపై.. బ‌ల‌వంతంగా వ్య‌భిచారం

Published : Jan 05, 2022, 04:39 AM IST
Minor Girl Rape case:  హైద‌రాబాద్‌లో దారుణం.. బాలికపై అత్యాచారం ఆపై.. బ‌ల‌వంతంగా వ్య‌భిచారం

సారాంశం

Minor Girl Rape case: ఇంట్లో వారితో గొడవపడి బయటికెళ్లిన బాలికపై కామాంధులు క‌న్నేశారు. మ‌య మాటలు చెప్పి.. తీసుకెళ్లి అత్యాచారానికి పాల్ప‌డ్డారు. అంత‌టితో ఆగ‌కుండా వ్యభిచారం కూడా చేయించారు. ఈ దారుణ ఘటన హైదరాబాద్ పాతబస్తీలో చోటు చేసుకుంది.  

Minor Girl Rape case:  హైద‌రాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. ఇంట్లో  గొడ‌వ ప‌డి అర్థ‌రాత్రి బ‌య‌ట‌కు వ‌చ్చిన ఒక బాలికపై కొంద‌రు దాడి చేశారు. అంతే కాకుండా ఆ బాలికపై అత్యాచారం చేశారు. వీటితో ఆగ‌కుండా ఆ బాలిక‌ను వ్య‌భిచార కూపీలోకి దించారు. ఈ విషాద‌క‌ర ఘ‌ట‌న హైద‌రాబాద్ లోని పాతబ‌స్తీలో చోటు చేసుకుంది.

హైద‌రాబాద్ లోని పాత బ‌స్తీ కిష‌న్ బాగ్ ప్రాంతానికి చెందిన ఒక బాలిక త‌న ఇంట్లో వాళ్లో గొడ‌వప‌డి న‌వంబ‌ర్ 20 న బ‌య‌ట‌కు వ‌చ్చింది. ప‌దిరోజుల పాటు ఆ బాలిక కోసం వెతికి చివ‌ర‌కు డిసెంబర్ 1వ తేదీ బాధిత బాలిక తల్లి బహదూర్ పురా పోలీసులను ఆశ్ర‌యించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు. చివ‌రికి ఓ ఇంటిపై దాడి చేయ‌గా.. బాలిక దొరికింది. అయితే.. ఆమెను ప్ర‌శ్నించగా.. విస్తుపోయే నిజాలు వెలుగులోకి వ‌చ్చాయి.

Read Also: తెలంగాణలో కరోనా కల్లోలం.. ఒక్కరోజులో 1000 కేసులు, ఏడు నెలల తర్వాత ఇదే తొలిసారి

హైద‌రాబాద్ లోని పాత బ‌స్తీ కిష‌న్ బాగ్ ప్రాంతానికి చెందిన ఓ బాలిక త‌న అక్క‌తో గొడ‌వప‌డి న‌వంబ‌ర్ 20 న బ‌య‌ట‌కు వ‌చ్చింది.  అయితే..  అర్ధరాత్రి ఒంటరిగా కనిపించిన బాలికపై కామాంధులు కన్నేశారు.   కొందరు యువకులు ఆ బాలిక‌ను  వెంబడిస్తే.. సమీర్ అనే  ఆటో డ్రైవర్ గమనించి ఆకతాయిల నుంచి రక్షించాడు. బాలిక వివరాలను ఆటో డ్రైవర్ ఆరా తీయగా ఇంటికి వెళ్లనని చెప్పడంతో ఆటో డ్రైవర్ సమీర్, అతని స్నేహితుడు హఫీజ్​తో కలిసి బాలికకు మ‌య మాట‌లు చెప్పి.. అత్తాపూర్​ పరిధిలోని ఉప్పర్​పల్లిలో ఉన్న తన ఇంటికి తీసుకెళ్లారు. ఆ త‌రువాత‌ ఆ బాలిక‌కు మ‌ద్యం తాగించి.. అత్యాచారానికి పాల్ప‌డ్డారు. అంత‌టితో ఆ బాలిక‌ను వీడిచిపెట్ట‌కుండా.. న‌గ‌రంలోని మైలార్ దేవ్ ప‌ల్లి లో మ‌రో ఇద్ద‌రు మ‌హిళల సాయంతో ఒక ఇంట్లో ఉంచి వ్య‌భిచారం చేయిస్తున్నారని బహదూర్​ పురా సీఐ దుర్గా ప్రసాద్ తెలిపారు. బాలికకు మత్తు మందు ఇచ్చి వ్యభిచారం చేయిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైందని సీఐ తెలిపారు.

Read Also: మోడీ మళ్లీ ప్రధాని కాకూడదు.. పాకిస్తాన్ నటుడి సంచలన వ్యాఖ్యలు
 

సెల్ ఫోన్ లోకేష‌న్ ఆధారంగా.. 
బాధిత బాలిక త‌న‌ అక్క ఫోన్​కు తాను ఉండే.. లోకేషన్ పంపింది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు మైలార్​దేవ్​ పల్లి అలీనగర్​లోని ఓ ఇంట్లో దాడి చేసి బాలికను రక్షించారు. అక్కడే ఉన్న ముఠాలోని ఇద్దరు మహిళలను అరెస్ట్ చేయగా.. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

CP Sajjanar Serious On Journalist: ఎక్కడున్నా తీసుకొస్తా… ఇన్వెస్టిగేట్ చేస్తా | Asianet News Telugu
IMD Rain Alert : సంక్రాంతి పండగపూట తెలంగాణలో వర్షాలు... ఈ రెండు జిల్లాలకు రెయిన్ అలర్ట్