రైతా కోసం జరిగిన ఘటనలో వ్యక్తి మృతి.. ఐదుగురిని అరెస్టు చేసిన పోలీసులు

Published : Sep 13, 2023, 09:11 AM IST
రైతా కోసం జరిగిన ఘటనలో వ్యక్తి మృతి.. ఐదుగురిని అరెస్టు చేసిన పోలీసులు

సారాంశం

పంజాగుట్టలోని ఓ రెస్టారెంట్ లో రైతా కోసం జరిగిన గొడవలో ఒకరు మరణించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ కేసులో ఐదుగురు నిందితులను పంజాగుట్ట పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.

హైదరాబాద్ పంజాగుట్టలోని మెరిడియన్ రెస్టారెంట్ లో ఆదివారం రాత్రి అదనపు రైతా విషయంలో జరిగిన గొడవలో మహ్మద్ లియాఖత్ (32) అనే కస్టమర్ మృతి చెందాడు. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మంగళవారం ఐదుగురిని అరెస్టు చేశారు.  గొడవకు మొదట కారణమైన వెయిటర్ కృష్ణ సూర్య, పాండు, ఆలం దార్, మొయిన్, అజీజ్ లను పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. ఈ నిందితులపై పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. అంతర్గత గాయాలతో లియాఖత్ మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. 

ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగి ఉన్న బస్సును ఢీకొన్న ట్రక్కు.. 11 మంది మృతి

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం లియాఖత్ తన స్నేహితులతో కలిసి బిర్యానీ తినడానికి రెస్టారెంట్ కు వెళ్లాడు. ఆహారం అందించడంలో జాప్యం జరిగింది. దీంతో ఆయన ఎక్స్ ట్రా రైతా కావాలని వెయిటర్ కృష్ణ ను అడిగాడు. దీంతో అతడు దురుసుగా మాట్లాడటంతో వాగ్వాదం ప్రారంభమైంది. ఈ క్రమంలో లియాఖత్ స్నేహితుడు కృష్ణను కొట్టాడు. దీంతో ఆ రెస్టారెంట్ లో పని చేసే ఇతర సిబ్బంది అతడిని కాపాడేందుకు వచ్చారు. ఈ వాగ్వాదంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఇదంతా అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది.

ఐదేళ్లుగా ప్రేమ.. పెళ్లికి నిరాకరించిన యువతి.. నిప్పంటించుకున్న యువకుడు..

ఆ తర్వాత ఈ ఇష్యూను పంజాగుట్ట పోలీసు స్టేషన్‌కు రాత్రి 11 గంటల ప్రాంతంలో తీసుకెళ్లారు. పోలీసులను ఆశ్రయించిన తర్వాత లియాఖత్ మాత్రం ఊపిరాడటం లేదని, చాతిలో నొప్పి అంటూ అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. ఆయనను వెంటనే హాస్పిటల్ తరలించారు. కానీ అప్పటికే అతడు మరణించాడని డాక్టర్లు ప్రకటించారు. దీంతో పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. అందులో అంతర్గత గాయాలతో లియాఖత్ మరణించాడని తేలింది. దీంతో ఈ గొడవలో ప్రమేయం ఉన్న ఐదుగురిని పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

సజ్జనార్ నువ్వు కాంగ్రెస్ కండువా కప్పుకో: Harish Rao Comments on CP Sajjanar | Asianet News Telugu
Harish Rao Serious Comments: సైబర్ నేరగాళ్లకు రేవంత్ రెడ్డికి తేడా లేదు | Asianet News Telugu