
హైదరాబాద్ : హైదరాబాద్ పాతబస్తీలో గ్యాంగ్ వార్ కలకలం రేపింది. ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. మృతుడిని నజీర్ అహ్మద్ గా గుర్తించారు. నజీర్ అహ్మద్ రెండేళ్ల క్రితం జహీరాబాద్ లో జరిగిన విషాల్ షిండే హత్యకేసులో నిందితుడు. కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హఫీజ్ బాబా నగర్ లో నజీర్ అహ్మద్ ను హత్య చేశారు దుండగులు. ఈ హత్యకు పాతకక్షలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.