కూకట్ పల్లిలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అదృశ్యం.. వారంలో రూ. కోటి ట్రాన్సాక్షన్...

కూకట్ పల్లిలో ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ నాలుగు రోజులుగా కనిపించకుండా పోయాడు. ఈ ఘటన మిస్టరీగా మారింది. 

software engineer missing in Kukatpally - bsb

హైదరాబాద్ :  తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అదృశ్యమయ్యాడు. నాలుగు రోజులుగా కనిపించకుండా పోయాడు. వారం రోజుల వ్యవధిలో అతని బ్యాంక్ అకౌంట్ నుంచి రూ.కోటి ట్రాన్షాక్షన్స్ జరిగినట్టుగా గుర్తించారు. దీంతో కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. 

వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న  పోలీసులు కిడ్నాప్, మిస్సింగ్ అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా శ్రీధర్ కాల్ డేటా, సిసి ఫుటేజ్ లను పోలీసులు పరిశీలిస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

Latest Videos

vuukle one pixel image
click me!