సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ బావిలో మృతదేహం.. వెలికితీత

By Mahesh K  |  First Published Dec 23, 2021, 5:42 AM IST

ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్‌లో కూలికి వెళ్లిన వరదరాజాపూర్ గ్రామానికి చెందిన యువకుడు కాలి జారి బావిలో పడ్డాడు. పడగానే.. మంగళవారం రాత్రి వరకు గాలింపులు జరిగాయి. కానీ, ఆయన ఆచూకీ కనిపించలేదు. బుధవారం బావిలో నుంచి డెడ్ బాడీని వెలికి తీశారు. ప్రత్యేక వాహనంలో ఆ డెడ్ బాడీని వరదరాజాపూర్ తీసుకెళ్లి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
 


హైదరాబాద్: సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్‌ (KCR Farm House) లో కలకలం రేగింది. ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్‌లో నుంచి మృతదేహాన్ని (Dead Body) వెలికి తీశారు. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందించారు. ఫామ్ హౌస్‌లో పని కోసం వెళ్లిన యువకుడు కాలు జారి బావిలో పడిపోయాడు. ఈ ఘటన ఉద్రిక్తతలకు దారి తీసింది. యువకుడి తరఫు వారు ఫామ్ హౌస్ ముందు ఆందోళనకు దిగారు. బుధవారం ఆ యువకుడి మృతదేహాన్ని వెలికి తీశారు.

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లిలో సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ ఉన్నది. ఆ క్షేత్రంలో పని చేయడానికి చాలా మంది కూలీలు రోజూ వెళ్తుంటారు. అదే విధంగా పొరుగునే ఉన్న వరదరాజాపూర్ గ్రామానికి చెందిన ఆంజనేయులు(19) మంగళవారం ఫామ్ హౌస్‌‌కు పని చేయడానికి వచ్చాడు. పనిలో చేరాడు. అయితే, అక్కడే ఓ బావి వద్ద ఉన్న చెట్ల పొదలను తొలగించాల్సిందిగా అధికారులు ఆంజనేయులను పురమాయించారు. అధికారులు చెప్పడంతో ఆంజనేయులు వెళ్లి ఆ పనిలో పడ్డాడు. కానీ, పక్కనే ఉన్న బావిలో జారి పడిపోయాడు. ఆంజనేయులు కోసం ఎంత గాలించినా మంగళవారం రాత్రి వరకూ దొరకలేడు. చివరకు ఆయన మృతదేహమే బుధవారం లభించింది. ఆయన డెడ్ బాడీని బావిలో నుంచి వెలికి తీశారు.

Latest Videos

undefined

Also Read: కేసీఆర్ ఫామ్ హౌస్ మీద బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

ఆంజనేయులు కుటుంబ సభ్యులను ఫామ్ హౌస్‌లోకి అనుమతించలేదు. వ్యవసాయ క్షేత్రంలోనే పోస్టుమార్టం నిర్వహించి డెడ్ బాడీని ప్రత్యేక వాహనంలో తీసుకెళ్లారు. వరదరాజాపూర్‌కు ఆంజనేయులు మృతదేహాన్ని తీసుకెళ్లి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆ కుటుంబానికి రూ. 7.5 లక్షల పరిహారాన్ని అందించినట్టు సమాచరాం అందింది.

కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు రేవంత్ రెడ్డిని గతేడాది మార్చిలో పోలీసులు అరెస్టు చేయడాన్ని తెలంగాణ కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రంగా స్పందించారు. రేవంత్ రెడ్డి అరెస్టును ఆయన ఖండించారు. స్పీకర్ అనుమతితోనే ఓ ఎంపీని అరెస్టు చేయాల్సి ఉంటుందని, అందుకు భిన్నంగా రేవంత్ రెడ్డిని అరెస్టు చేశారని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డి అరెస్టుపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తామని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. 

111 జీవో పరిధిలో నిర్మాణాలకు అనుమతి లేదని, మరి తెలంగాణ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ ను ఎలా కట్టారని ఆయన అన్నారు. కేసీఆర్ కుటుంబానికి ఓ న్యాయం, పేదలకు మరో న్యాయమా అని అడిగారు. కేసీఆర్ ఫామ్ హౌస్ ను కూల్చే దమ్ములు అధికారులకు లేవని ఆయన అన్నారు. 

కేటీఆర్ ఫామ్ ఫాం హౌస్ పై ట్రిబ్యునల్ కు లేఖ రాయనున్నట్లు ఆయన తెలిపారు. కోకాపేట భూములు కేటీఆర్ మనుషుల చేతుల్లో ఉన్నది వాస్తవం కాదా అని ఆయన నిలదీశారు. గోపన్ పల్లి, కోకాపేట భూములపై న్యాయ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. గోపన్ పల్లి భూముల విషయంలో రేవంత్ రెడ్డి తప్పు చేసినట్లు తేలితే చర్యలు తీసుకోవచ్చునని ఆయన అన్నారు.

click me!