చెట్టును ఢీకొట్టిన కారు.. ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి.. మరో ఇద్దరికి గాయాలు

Published : Sep 11, 2023, 09:56 AM IST
చెట్టును ఢీకొట్టిన కారు.. ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి.. మరో ఇద్దరికి గాయాలు

సారాంశం

రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు చెట్టును వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు మరణించారు. మరో ఇద్దరికి గాయాలు అయ్యాయి.

విహార యాత్ర విషాదం నింపింది. ఇంజనీరింగ్ చదివే నలుగురు విద్యార్థులు సరదాగా విహారయాత్రకు వెళ్లి కారులో తిరుగు ప్రయాణం మొదలుపెట్టారు. అయితే ఆ కారు ఆ వాహనం వేగంగా చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ప్రమాదం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ప్రాంతంలో జరిగింది.

ఘోర రోడ్డు ప్రమాదం.. కారు-ట్రక్కు ఢీ.. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి..

వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లోని కొంపల్లిలో సెయింట్‌మారిటన్ ఇంజనీరింగ్ కాలేజీ ఉంది. అందులో 19 ఏళ్ల చప్పిడి సోని, ప్రదీప్ కుమార్, అఖిల్, ఆర్యవర్థన్ బీటెక్ చదువుతున్నారు. వీరు సెకెండియర్ పూర్తి చేసి థర్డ్ ఇయర్ లోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ నలుగురు స్నేహితులు కలిసి సరదాగా వికారాబాద్ జిల్లాలో ఉన్న అనంతగిరి హిల్స్ చూసి రావాలని ప్లాన్ చేసుకున్నారు. అందులో భాగంగానే వారంతా కారులో శనివారం బయలుదేరారు.

స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ సమయంలో నాకు ఆ శాఖ లేదు - టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు

రాత్రి అక్కడే ఉండి ఆదివారం ఉదయం తిరిగి హైదరాబాద్ కు ప్రయాణం మొదలుపెట్టారు. ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న కారు చేవెళ్ల మండలం ఆలూరు బస్‌స్టేజీ దగ్గర అదుపుతప్పి ఓ చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో సోని, ప్రదీప్ కుమార్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో వారు అక్కడే మరణించారు. అలాగే అఖిల్, ఆర్యవర్థన్ కు కూడా తీవ్ర గాయలు అయ్యాయి.

నందివాడ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ శీరిష భర్త అనుమానస్పద మృతి.. హత్యేనని కుటుంబ సభ్యుల ఆరోపణ..

ఈ ప్రమాదాన్ని గమనించిన వెంటనే స్థానికులు అప్రమత్తమయ్యారు. క్షతగాత్రులను బయటకు తీసేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో పోలీసులు, అంబులెన్స్ లు అక్కడికి చేరుకున్నాయి. వారంతా కలిసి క్షతగాత్రులను, డెడ్ బాడీలను బయటకు తీశారు. అనంతరం వాటిని చేవెళ్ల హాస్పిటల్ కు తీసుకెళ్లారు. ప్రస్తుతం అఖిల్, ఆర్యవర్దన్‌ హైదరాబాద్ లోని ఓ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు జరుపుతున్నారు. కాగా.. విహార యాత్ర కోసం వెళ్లి, విగిత జీవులుగా తిరిగి వచ్చిన పిల్లలను చూసి తల్లిదండ్రులు తీవ్రంగా రోధించారు.

PREV
click me!

Recommended Stories

Singer Mangli in Multiple Controversies: మంగ్లీ చుట్టూ ఇన్ని వివాదాలా? | Asianet News Telugu
డబ్బులుంటేనే ఎవరైనా.. రేవంత్ రెడ్డి సంచలన ప్రెస్ మీట్ | Asianet News Telugu